40.2 C
Hyderabad
April 29, 2024 18: 25 PM
Slider చిత్తూరు

ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

#ttd

టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రీ డిగ్రీ (ఇంటర్ ), డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల‌ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల‌ ప్రీ డిగ్రీలో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 18 ఏళ్ల‌ లోపు వయసు కలిగి ఎస్ఎస్‌సి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు.

మూడేళ్ల‌ సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయసు కలిగి ప్రీ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి.

కె.టి. రోడ్డులోని కళాశాల కార్యాలయంలో రూ.25/- చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను జూలై 31వ తేదీలోపు సమర్పించాలి. ప్రవేశం లభించిన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా ఉచితంగా హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. ఇతర వివరాలకు 0877 – 2264604, 0877 – 2263974 నంబర్లను సంప్రదించ‌గ‌ల‌రు.

Related posts

జాతీయ బీసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా కన్వీనర్ గా సంద బాబు

Satyam NEWS

ఆదివాసీల గురించి ఆలోచించిన మహా నాయకుడు

Bhavani

భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ తో మౌనిక చారిటబుల్ పౌండేషన్ అధినేత్రి భేటీ

Satyam NEWS

Leave a Comment