వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరు లోని రైతు ఆంజనేయులు తల్లి పేర 1ఎకరా 26 గుంటల భూమి ఉంది. ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కొంత మంది రియల్టర్ లు ఇప్పటికే కొంత కబ్జా చేసారు. బాధితుడు సర్వే కోసం దరఖాస్తు చేసినప్పటి నుండి రియల్టర్ ల నుండి బెదిరింపులు, మద్యవర్తులతో బేరసారాలు ప్రారంభించారు. రైతు వినలేదని నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారు. పెబ్బేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. తహసీల్దార్ సుజాత నేడు రేపు అంటూ సర్వే చేయలేదు. అంతే కాకుండా నేడు సర్వే చేయడానికి సర్వేయర్ అక్కడికి వెళ్లాడు. అయితే సర్వే చేయవద్దని సర్వే చేస్తున్న సర్వేయర్ కు తహసీల్దార్ ఫోన్ చేయటం తో అతను వెనక్కి వచ్చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగడానికి ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ తహసీల్దార్ ఉన్నంత వరకు తన భూమి తనకు దక్కదని అతను అంటున్నాడు. ఆత్మహత్యాయత్నాన్ని కార్యాలయ సిబ్బంది ఆపారు.