అయోధ్య కేసులో రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య కేసులో సుప్రీంకోర్టు రేపు తీర్పు చెప్పనుంది. అయోధ్య రామజన్మభూమిపై శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది తీర్పును వెలువరించనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను కలిసిన ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పరిస్థితిని వివరించి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోం శాఖ ఇప్పటికే అన్నీ రాష్ట్రాల డిజిపిలను ఎలర్ట్ చేసింది. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో సమస్యత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. తీర్పు ఎలా ఉన్నా అన్ని వర్గాల వారు శాంతియుతముగా ఉండాలని కేంద్ర హోంశాఖ కోరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 34 జిల్లాలో 144 సెక్షన్ విదించారు. హిందు, ముస్లిం మద్దతు దారులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యవద్దని కేంద్ర హోంశాఖ హెచ్చరిక జారీ చేసింది. అదే విధంగా అయోధ్యలో పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ బేరీజు వేసుకుంటున్నది.
previous post