38.2 C
Hyderabad
May 3, 2024 19: 18 PM
Slider ప్రత్యేకం

D Day July 8th :న్యాయ నిపుణులు ఏమంటున్నారు?

#NBSudhakarReddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ బెయిలు రద్దు కేసు ఏమవుతుంది ? అనే అంశంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ నెలకొని ఉంది. బెయిల్ రద్దు పిటిషన్ మీద జూలై 8 న ఏం జరుగుతుంది, తదనంతర పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విశ్లేషణ ఇది.

బెయిల్ రద్దు పిటిషన్ మీద జూలై ఒకటితో వాదనలు ముగిసాయి. కానీ రఘురామకృష్ణరాజు తరఫు లాయర్లు… సిబిఐ వాదన కూడ కావాలని అడిగారు. సిబిఐ అప్పటికి తన వైపు వాదన ఏమి వినిపించలేదు. ఏక వాక్య కౌంటర్ తీరులోనే సైలెంట్ గా ఉంది. రాజు గారి లాయర్ల అభ్యర్థనను అంగీకరించిన కోర్టు 8 వ తేదీ లోపు సిబిఐ వాదనను లిఖిత పూర్వకంగా సమర్పించమని ఆదేశించింది. దీనర్ధం జూలై 8 కి మూడు పక్షాల వాదనలు పూర్తవుతాయి.

సిబిఐ వాదనను అడగడం ద్వారా తమ వైపు బలం పెంచుకునే వ్యూహమని స్పష్టమవుతుంది. అంటే రాజు గారి లాయర్లు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. సిబిఐ “ఖచ్చితంగా స్పందిస్తే” అది బెయిల్ రద్దు చేయమని కోరాలి. ఎందుకు???

రాజు గారి రిజాయిండర్ మీద కౌంటర్ వేస్తాం మాకు సమయం ఇవ్వండి అని జగన్ తరఫు లాయర్లు కోర్టును కోరడం జరిగింది. అది సమయాన్ని వృథాగా పొడిగించడమేనని తెలుసు. కానీ కోర్టు సాంకేతికంగా కూడ అంగీకరించలేదు. ఎందుకు???

జూలై 8 న కోర్టుకి అన్ని పక్షాల వాదనలు అందాక వాటిని పరిశీలించి తీర్పు ఇవ్వగల తేదీని కోర్టు ప్రకటిస్తుంది. సహజంగా ఒకటి నుంచి మూడు వారాల సమయం పడుతుంది.

జగన్ కు కూడా  బెయిల్ రద్దు అవుతుందని ఇప్పటికే తెలుసని అంటున్నారు.

అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. బెయిల్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషన్ లో ప్రస్తావించిన ఒక్క అంశానికి కూడ “కౌంటర్” వేయలేదు. కౌంటర్ పేరుతో వాదించింది ఏమంటే… పిటిషనర్ కి అర్హత లేదు అని మాత్రమే. పిటిషనర్ ప్రస్తావించిన ఉల్లంఘనలను… అవి నిబంధనలకు వ్యతిరేకం కాదని చెప్పలేకపోయారు.

ఉదాహరణకు: సహనిందితుడికి రాజ్యసభ సీట్ కట్టబెట్టి సమాజంలో పెద్దమనిషిగా చిత్రీకరించడం బెయిల్ నిబంధన ఉల్లంఘన. సహనిందితురాలుని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టడమే కాకుండా అడ్డదారుల్లో ప్రమోషన్ ఇవ్వడం బెయిల్ నిబందనల ఉల్లంఘన. ముఖ్యమంత్రి అయ్యాక సొంత, కుటుంబ, సహ నిందితుల కంపెనీలకు, వ్యాపారాలకు నేరుగా ప్రభుత్వ పరంగా మేళ్ళు చేయడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన. ఇలాంటి వాటికి ఉల్లంఘన జరగలేదనే కనీస వాదన కూడ జరగలేదు.

అసలు పై కోర్టులో అపీల్ కి అవకాశం కూడ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు కాబట్టి మరియు నిబంధనల ఉల్లంఘన జరగలేదనే వాదన చేయలేదు కాబట్టి.

Related posts

నిర్భయంగా ఓటు వేయండి

Sub Editor

కర్నూలులో ప్రియురాలుని చంపి ప్రియుడు ఆత్మహత్య

Satyam NEWS

గతవారం కంటే తగ్గిన స్పందన ఫిర్యాదులు…!

Satyam NEWS

Leave a Comment