30.7 C
Hyderabad
April 29, 2024 05: 10 AM
Slider ఆంధ్రప్రదేశ్

కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన సిఎం జగన్‌

jagan-jpg_710x400xt

‘‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు, మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం మీరు ఎంతోకొంత మంచిచేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. నేడు ఆయన కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయవచ్చునని ఈ సందర్భంగా సీఎం అన్నారు. కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి ఆయన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్, ప్రణాళికా శాఖ డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి సహాయం కోసం ఈ వైబ్‌సైట్‌ నిర్దేశించారు.

Related posts

తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో స్థానిక ప్ర‌తినిధుల స‌హ‌కారం

Satyam NEWS

దాతృత్వానికి మరోపేరుగా నిలిచిన మాగుంట సుబ్బరామిరెడ్డి

Bhavani

తెలంగాణపై వివక్ష: పార్లమెంటులో పోరాటానికి కేసీఆర్ ఆదేశం

Satyam NEWS

Leave a Comment