27.7 C
Hyderabad
May 4, 2024 08: 52 AM
Slider మహబూబ్ నగర్

పచ్చి రొట్ట ఎరువుల తో భూసారాన్ని పెంచుకోవాలి

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు రైతు వేదిక దగ్గర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ సహాయ సంచాలకులు రవి మాట్లాడుతూ రైతులు వెదజల్లే పద్ధతి లో వరి సాగు చేయడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకొని అధిక ఆదాయం పొందాలని తెలిపారు.

పచ్చి రొట్ట ఎరువులు వేసుకొని భూసారం పెంచుకొని, ఎరువుల ఖర్చు తగ్గించుకోవాలని తెలిపారు. భాస్వరం కరిగించు బాక్టీరియా వాడకం ద్వారా భూమిలోని భాస్వరం పంటలకు అందుతుంది అని తెలిపారు. అదే విధంగా ఎరువులు ఒకేసారి వేయకుండా దఫా దఫలుగా వేయడం ద్వారా పంటకు అందు తుంది అని తెలిపారు. వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ ఆధునిక పద్దతిలో సాగు చేపట్టి అధిక దిగుబడులు, అధిక ఆదాయం పొందగలరు అని తెలిపారు.

కార్యక్రమం లో ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టి అధిక ఆదాయం పొందాలని తెలిపారు. మామిడి సాగు మరియు కూరగాయలు సాగు చేపట్టి రైతులు అధిక ఆదాయం పొందగలరు అని తెలిపారు. ఉద్యాన పంట సాగులో మెలకువలు చెప్పారు.

ఈ కార్యక్రమం లో AEO మౌనిక , సర్పంచు బండి లక్ష్మి దేవమ్మ, PACS డైరెక్టర్, గ్రామ రైతు బంధు కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి, కొల్లాపూర్ మామిడి రైతు సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి రైతులు పాల్గొన్నారు.

Related posts

బతుకమ్మ చీరలను విసిరిన మహిళలు

Satyam NEWS

గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేటర్స్ స్పోర్ట్స్ మీట్

Satyam NEWS

ఈటెల రాజేందర్ కు బిజెపి నేత పాయల్ శంకర్ పరామర్శ

Satyam NEWS

Leave a Comment