39.2 C
Hyderabad
May 3, 2024 12: 36 PM
Slider కృష్ణ

ప్రధాని మోదీ ఎపీకి వచ్చే అర్హత ఉందా?

#potulabalakotaiah

ప్రధాన నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అర్హత ఉందా? అని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ విభజనలో తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్న మోడీ మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, అల్లూరి సీతారామరాజును లూథర్ ఫర్డ్ చెట్టుకు కట్టి కాల్చినట్లు, ఆంధ్రప్రదేశ్ విభజన హక్కుల్ని, ప్రత్యేక హోదాను మోదీ కాల్చే చేశారని ఆరోపించారు.

ఎపికి మోదీ మరో రూథర్ ఫర్డ్ అని ధ్వజమెత్తారు. విభజనలో గాయపడ్డ రాష్ట్రానికి హోదా, రాజధాని నిధులు, పోలవరం, వెనుక పడ్డ ప్యాకేజీ వంటి హక్కులతో ఆదుకుంటామని చెప్పి, అన్నింటికీ మంగళం పాడారన్నారు. 22 మంది ఎంపీలను ఇస్తే, కేంద్రం కాలర్ పట్టుకుని హోదా తెస్తామన్న వైకాపా పార్టీ మోదీ కాళ్ళు బాగా పట్టుకుందని, రాష్ట్ర పతి ఎన్నికల్లో అవకాశం వచ్చినా చేజార్చుకుందని ఆరోపించారు.

ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్లు అన్న జనసేన పార్టీ బిజెపితో అంటకావుతూ హోదా మరిచిందని చెప్పారు. రాజకీయ ఉరితాళ్ళతో హోదాను ఉరితీసిన ప్రధాన మంత్రి ఏపీ కొచ్చి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. అల్లూరి వంటి మన్యం వీరుని సభలో ఏ స్ఫూర్తి నింపుతారని పేర్కొన్నారు. హోదా, అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు, దళితులపై దాడులు వంటి అంశాలపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా ఉద్యమకారులు ప్రధాని మోడీ పర్యటన పట్ల నిరసన తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలకోటయ్య పిలుపునిచ్చారు.

Related posts

అదేమిటో ఇద్దరూ చెరో రకంగా చెప్పారు

Satyam NEWS

పాడేరు ఏజెన్సీలో మావోయిస్టుల లేఖ ప్రత్యక్షం

Satyam NEWS

ప్రాణ‌వాయువు కొర‌త తీరిపోయింది: విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన‌…!

Satyam NEWS

Leave a Comment