33.2 C
Hyderabad
May 12, 2024 12: 27 PM
Slider జాతీయం

సోషల్ మీడియానే నిజమని నమ్ముతున్న ఇండియా

భారత్‌లో కచ్చితమైన సమాచారం తెలుసుకొనేందుకు, తమకు తెలిసిన విషయాన్ని రూఢీ చేసుకొనేందుకు 54% మంది ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఈ శాతం మెక్సికో, దక్షిణాఫ్రికాలో 43%గా ఉంది. బ్రిటన్‌లో మాత్రం ఇది కేవలం 16 శాతమే ఉండటం గమనార్హం. పుస్తకాలు, పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్నే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్​ సర్వే వెల్లడించింది.భారత్​లో 87శాతం మంది సోషల్​ మీడియాలో వచ్చిన సమాచారాన్నే నమ్ముతున్నారని పేర్కొంది.ఈ సర్వేను భారత్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, అమెరికా, యూకేల్లో ‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌’ నిర్వహించింది. మిగతా దేశాలతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో తాము చదివిన, పంచుకున్న సమాచారం నిజమేనని 87% భారతీయులు నమ్మడం విశేషం. సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా 67% మంది గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌పై ఆధారపడుతున్నారు. నిజానిజాల నిర్ధారణకు 52 శాతం మంది ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. యువకులు సామాజిక మాధ్యమాల్లో వచ్చిందే నిజమని నమ్ముతున్నారు. 25 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 44 శాతం మంది తాము ఎక్కువగా సోషల్‌ మీడియానే నమ్ముతామని తెలిపారు.

Related posts

వై ఎస్ జగన్ రాజకీయ వలలో చిక్కుకున్న వకీల్ సాబ్

Satyam NEWS

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ’ఎవోల్’ (EVOL)

Bhavani

దారుణమైన పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ మహానగరం

Satyam NEWS

Leave a Comment