33.2 C
Hyderabad
May 4, 2024 02: 32 AM
Slider మహబూబ్ నగర్

విద్యుత్ అంతరాయంతో రైతుల అవస్థలు

#peddakottapallimandal

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో గత ఐదు రోజుల నుంచి విద్యుత్ అంతరాయంతో పంటకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారని బిజెపి మండల అధ్యక్షుడు పదర భీమేష్ రెడ్డి అన్నారు. రైతుల సాగు పంటలపై విద్యుత్ అంతరాయాన్ని నిరసిస్తూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో భీమేష్ రెడ్డి అధ్యక్షతన పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా భీమేష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ సరిగా అందక సాగుచేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజక వర్గప్రజాప్రతినిధులు,మండల ప్రజాప్రతినిధులు,విద్యుత్ అధికారులు స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన  విద్యుత్తు అందివాలన్నారు.రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో బిజెపి నాయకులను పెద్దకొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ తరలించారు. రస్తారోకోలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జలాల శివుడు,బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి శరత్ రెడ్డి, మండల ఇన్చార్జి కర్తల కృష్ణయ్య, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

50 మంది స్కూల్ పిల్లలపై పిచ్చి కుక్కల దాడి

Satyam NEWS

వివాదంలో కామారెడ్డి ఎమ్మెల్యే

Bhavani

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి

Satyam NEWS

Leave a Comment