పిచ్చి కుక్కల స్వైరవిహారంతో దాదాపు 50 మంది స్కూలు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎక్కడో మారుమూల పల్లెలో కాదు జరిగింది. సాక్ష్యాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో. ఇక్కడి ధరమ్ కరమ్ రోడ్డులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి.
అటుగా వెళుతున్న స్కూల్ విద్యార్థులపై దాడి చేశాయి. దాంతో పిచ్చి కుక్కల కాటుకు 50 మంది స్కూల్ విద్యార్థులు గురయ్యారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆ విద్యార్థులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.