42.2 C
Hyderabad
May 3, 2024 16: 56 PM
Slider ముఖ్యంశాలు

వివాదంలో కామారెడ్డి ఎమ్మెల్యే

#MLA


-రైస్ మిల్ గుమస్తాపై చేయి చేసుకున్న వీడియో వైరల్

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వివాదంలో చిక్కుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులకు లబ్ది చేకూర్చేలా చూడాల్సిన ఎమ్మెల్యే తీరుతో రైస్ మిల్లులు మొత్తం మూసేసి నిరసనకు దిగే పరిస్థితి నెలకొంది. బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో ఉన్న పూర్ణిమ రైస్ మిల్ సిబ్బందిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రతిపక్షాలైతే ఇలాగేనా ఎమ్మెల్యే ప్రవర్తించేది అంటూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుని రైస్ మిల్లర్లు వ్యతిరేకిస్తూ నేడు జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులు మూసేసి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు

అసలేం జరిగింది..?

గడిచిన కొద్ది రోజులుగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వడగళ్ల వానతో ధాన్యం తడిసి ముద్దయిపోతుంది. దాంతో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరడంతో రైస్ మిల్లర్లు కూడా సానుకూలంగా స్పందించారు.

అయితే శుక్రవారం రాత్రి రైస్ మిల్లుల పరిశీలనకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వెళ్లారు. బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులోని పూర్ణిమ రైస్ మిల్లర్లతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కోపోద్రుక్తుడై సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఎమ్మెల్యేపై విమర్శలు మొదలయ్యాయి.

రైస్ మిల్లులు బంద్

రైస్ మిల్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. రైస్ మిల్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడిని రైస్ మిల్లర్లు తీవ్రంగా ఖండించారు.

శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులు మూసేసి నిరసన తెలిపారు. తక్షణమే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రైస్ మిల్ సిబ్బందికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్షమాపన చెప్పేవరకు రైస్ మిల్లులు తెరిచేది లేదని తేల్చి చెప్తున్నారు

ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
-బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి

రైస్ మిల్ సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెయ్యి చేసుకోవడం విచారకరమని, ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తీరుతో రైస్ మిల్లర్లు మిల్లులు బన్ధ చేసారని, రైస్ మిల్లర్ల మిల్లింగ్ బంద్ కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తీరు వల్ల ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే వెంటనే రైస్ మిల్లర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను వారి కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లర్లు లోడింగ్, ఆన్ లోడింగ్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొంటున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేసే లోపే నిన్న రైస్ మిల్ సిబ్బందిపై చెయ్యి చేసుకోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు.

మిల్లర్లకు రైతులకు వారధిగా అధికారులు, రాజకీయ నాయకులు ఉండాలి కానీ అధికారుల సమక్షంలో అధికారులు చూస్తుండగా ఎమ్మెల్యే చెయ్యి చేసుకోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే తీరు వల్ల రైతు నిండా మునగాల్సి వస్తుందన్నారు. రైతుల పక్షాన ఒక సారి ఆలోచించి ఎమ్మెల్యే సత్వరమే క్షమాపణలు చెప్పి మిల్లింగ్ ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం లోపు రైస్ మిల్లులు ప్రారంభించాలని లేకపోతే రైతుల తరుపున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Related posts

23న హైదరాబాద్ లో ఎగుమతులను పెంచడానికి వాటాదారుల ఔట్రీచ్

Satyam NEWS

సరుకు రవాణాలో విశాఖ పోర్టు ట్రస్టు నూతన అధ్యాయం

Satyam NEWS

వార్ టైం: రేపటి నుంచి ఏపి అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు

Satyam NEWS

Leave a Comment