27.7 C
Hyderabad
May 15, 2024 06: 41 AM
Slider నిజామాబాద్

క్రాప్ ఫెస్టివల్: ఉత్సాహంగా రైతుల ఎల్లామాస ఉత్సవాలు

yellala festival

బిచ్కుంద  నియోజకవర్గంలో ఎలమాస పండగ ఉత్సవాలు రైతులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండే పిండి వంటలతో కూడిన బెల్లం పలుకులతో కూడిన పూలేలు, అంబలి  వివిధ రకాల కూరగాయలతో చేసిన భజ్జీ కూర ఈ ఉత్సవాలకు ప్రత్యేకమైనది.

రైతులు అమావాస ఉత్సవాలను పురస్కరించుకుని తమ జొన్న పంట చేలల్లో ధాన్య లక్ష్మికి ప్రత్యేక పూజలు చేసి పాలు పొంగిస్తారు. ఒలిగోరి ఒలెగి సాలం పలుగే అంటూ  అమ్మవారి ప్రతిష్ఠాపన చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి వన భోజనాన్ని చేస్తారు. ఇలా చేస్తే  పంటలు అధికంగా పండి రాబడి పెరుగుతుందన్నది రైతుల అభిప్రాయం.

ప్రతి ఏటా రబీ పంట వేసిన అనంతరం వచ్చే అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో మహారాష్ట్ర కర్నాటక సరిహద్దు మండలాలైన జుక్కల్ మద్నూర్ పెద్దకొడప్గల్ మండలంతో పాటు బిచ్కుందలోని కొన్ని గ్రామాలలో ఈ పండగ నిర్వహిస్తుంటారు. బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో ఎలా మాస పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని ఎంపిపి అశోక్ పటేల్ తన చేలలొ ఎల్ల మాస పండుగ  నిర్వహించారు.

ఈ సందర్భంగా పండుగ ఉత్సవాలలో ఎంపిపి ప్రత్యేక పూజల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ఎంపిపి రాజు పటేల్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిద్ధిరాములు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, మాజీ జడ్పిటిసి సాయిరాం ఆయా గ్రామాల సర్పంచ్ లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న జగన్: ఇప్పుడు మరో ఆశ్రమం

Satyam NEWS

2న టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎంపి

Satyam NEWS

పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభించాలి

Bhavani

Leave a Comment