అమరావతి గ్రామాలలో ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసులు సమాయాత్తం అవుతున్నారు. అమరావతి గ్రామాలలో వేరే గ్రామాలకు చెందిన వారు ఉండరాదని నేడు తాజాగా తాఖీదులు జారీ చేశారు. గ్రామాలలో గ్రామాలకు చెందిన వారే ఉండాలని వేరే వారికి ఆశ్రయం ఇవ్వద్దని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రాజధాని గ్రామాలలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై నడుస్తున్నా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అమరావతి గ్రామాలలో ధర్నాలు కూడా చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. రేపు ప్రకాశం బ్యారేజి వద్ద కొందరు రూట్ మార్చ్, నిరసన తలపెట్టారు.
దీన్ని అడ్డుకునేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ధర్నాలకు పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు లేనందున ఆ కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసు గట్టి బందోబస్తు ను ఏర్పాటు చేశారు. స్టాపర్ లు, బ్యారికేడ్ల తో వారిని నియంత్రించనున్నారు.