38.2 C
Hyderabad
May 2, 2024 19: 10 PM
Slider నిజామాబాద్

భిక్షాటన డబ్బులు తీసుకోండి.. మా భూములు ఇచ్చేయండి

#kamareddy

మున్సిపల్ కార్యాలయం ముందు భిక్షాటన డబ్బులు కుమ్మరించిన రైతులు

‘మా భూముల్ని కాపాడుకునేందుకు నెల రోజులుగా పోరాడుతున్నాం. ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా కామారెడ్డిలో భిక్షాటన చేసినం. భిక్షాటన ద్వారా వచ్చిన ఈ డబ్బులు తీసుకుని మాస్టర్ ప్లాన్ లో భాగంగా మీరు గుంజుకున్న భూములను మాకు తిరిగి ఇచ్చేయండి’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్, 100 ఫీట్ల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భిక్షాటన చేపట్టారు.

జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్ నుంచి కొత్త బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, నిజాంసాగర్ చౌరస్తా, రైల్వే కమాన్, సుభాష్ రోడ్, గంజ్ చౌరస్తా, ధర్మశాల, పాత బస్టాండ్, పంచముఖి హనుమాన్ ఆలయం, రైల్వే గేటు మీదుగా కొత్త బస్టాండ్ చేరుకున్నారు.

కొత్త బస్టాండ్ వరకే ముగిస్తారని భావించినా ఒక్కసారిగా కొత్త బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రైతులు పెద్దఎత్తున చేరుకుని కార్యాలయం ప్రధాన ద్వారం మూసేసి నిరసన తెలిపారు. భిక్షాటన సందర్భంగా ఓ దున్నపోతుకు మున్సిపల్ కౌన్సిల్ కామారెడ్డి అంటూ ఓ ప్లకార్డును తగిలించి దున్నపోతును కామారెడ్డి మొత్తం తిప్పారు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులతో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

కమిషనర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. కమిషనర్ లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. ప్రధాన ద్వారం ముందు కింద ఫ్లెక్సీ వేసి భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులు, కురాగాయలను కుమ్మరిరించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. తమ భూములు కాపాడుకోవడం కోసం భార్య పిల్లలతో రోడ్డుపై బిక్షం ఎత్తుకునే పరిస్థితి కల్పించారన్నారు.

రూపాయి రూపాయి కూడబెట్టడానికి చిందించిన చెమట, రక్తం ముద్దలను మీరు తినండి.. మా భూములను మాకు ఇవ్వండి అంటు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి బయట పడేందుకు ప్రతి రైతు కదిలి వచ్చారన్నారు. భిక్షాటన ద్వారా సేకరించిన ఈ డబ్బును మీకు అర్పిస్తున్నాం.. మాస్టర్ ప్లాన్ ఎత్తేయండి.. మా భూములు మాకు ఇవ్వండి అని వేడుకున్నారు.

ఇవి సరిపోకపోతే పంటలు పండించి వచ్చిన డబ్బులు కూడా ఇస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దయ్యేవరకు ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. తమ భార్య పిల్లలతో కలిసి రోడ్డుపైకి వస్తామని, అవసరం అయితే చావడానికైనా సిద్ధమని హెచ్చరించారు. రైతులు చేపట్టిన ఈ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు.

Related posts

శ్రీశైల మల్లన్న కు కాణిపాకం నుంచి పట్టువస్త్రాలు

Satyam NEWS

బోనాల వైభవం

Satyam NEWS

విలేకరులకు ప్లాట్లు ఇవ్వాలి:బిజెపి

Satyam NEWS

Leave a Comment