34.2 C
Hyderabad
May 10, 2024 12: 35 PM
Slider ముఖ్యంశాలు

వన్య ప్రాణిని కాపాడిన నారాయణపేట రైతులు

#narayanapet police

కుక్కల బారిన పడిన వన్య ప్రాణి జింకను ఎంతో శ్రమపడి కాపాడాడు ఒక రైతు. జింకను క్షేమంగా పట్టుకుని పోలీసులకు అప్పగించగా వారు అటవీ శాఖ అధికారులకు అందచేశారు.

ఈ సంఘటన నారాయణ పేట జిల్లా, నర్వ మండలం లోని లంకాల్ గ్రామ శివారులో జరిగింది. సంజీవ సాగర్ అనే రైతు పొలంలో నేడు ఒక జింక కనిపించింది.

ఆ జింకను కుక్కలు వెంటాడి చంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తుంటే లంకాల్ గ్రామానికి చెందిన రైతు సంజీవ్ సాగర్ దీన్ని గమనించాడు.

తన సాటి రైతు ఉప్పరి శివతో కలిసి వేట కుక్కలను తరిమే సాహసం చేశారు. ఒక దశలో కుక్కలు వారిపై తిరుగుబాటు చేసినా వారు ధైర్యంగా జింకను కాపాడి నర్వ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

తర్వాత నర్వ పోలీసులు పశు వైద్యుడిని పిలిచి గాయపడిన ఆ జింకకు చికిత్స చేయించారు. జింక కొద్దిగా తేరుకోగానే అటవీశాఖ అధికారి వాచర్ రాజు కు జింకను అప్పగించారు.

ఈ కార్యక్రమంలో నర్వ ASI ఖాజా మసిఉద్దీన్, కానిస్టేబుల్ రాజేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, శివ, వాచర్ రాజు పాల్గొన్నారు.

Related posts

బాలివుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మళ్లీ ఉపశమనం

Bhavani

జో విడెన్ తో మోదీ వ్యక్తిగత చర్చలు?

Satyam NEWS

రిమైండర్: జగనన్నా మమ్మల్ని మరచిపోయావా అన్నా?

Satyam NEWS

Leave a Comment