29.7 C
Hyderabad
April 29, 2024 09: 56 AM
Slider వరంగల్

ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్: చిన్నారి యధిత్య మరణం బాధాకరం

#taslima

ఏ పాపం ఎరుగని చిన్నారి యధిత్య మరణం చాలా బాధాకరమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.

ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కొట్టపాక అశోక్, చందన దంపతుల కూతురు యధిత్య గత కొన్ని రోజులుగా మల్టీసిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ వారం రోజుల క్రితం కోమాలోకి వెళ్ళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించింది.

విషయం తెలుసుకున్న తస్లీమా మంగళవారం ఇంచర్ల  గ్రామానికి వెళ్ళి చిన్నారి యధిత్యను చూసి చలించిపోయారు.

అనంతరం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. యధిత్య తనతో గడిపిన కొన్ని జ్ఞాపకాలు నెమరువేసుకుంటు తస్లీమా కంట కన్నీరు పెట్టుకున్నారు.

తలిదండ్రుల రోధన చూసి వారిని ఓదార్చారు. ఇలాంటి సందర్భంలోనే గుండె నిబ్బరంతో ఉండాలని ధైర్యం చెప్పారు. దహన సంస్కారాల నిమిత్తం సాయం అందించారు.

Related posts

నేరాల అదుపునకు.. నిఘా నేత్రాలు ఉపయోగకరం

Satyam NEWS

స‌ర్ధార్‌కు నివాళులు!

Sub Editor

గుర్ల కేసులో పోలీసుల మానతాకోణం..బాధితురాలి భవిష్యత్ పైనే దృష్టి

Satyam NEWS

Leave a Comment