36.2 C
Hyderabad
April 27, 2024 22: 21 PM
Slider వరంగల్

ఉపయోగపడే మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

#mulugu

ములుగు మండలంలో నేడు హరిత హారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా బరిగలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొత్త పల్లి పోషన్న మొక్కలు నాటారు. విద్యాశాఖ సూచన మేరకు పోషక విలువలు కలిగిన మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు.

మునగ, కరివేప, బొప్పాయి మొక్కలను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ గరిగ లత నర్సింగరావు, పాఠశాల చైర్మన్ కాయిత రమేశ్, పంచాయతీ కార్యదర్శి అనిల్ నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల కు కావలసిన పోషకాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం మంచి ఆలోచన అన్నారు.

పాఠశాల ఛైర్మన్ మాట్లాడుతూ మొక్కలు నాటడం తో పాటు వాటిని కాపాడుకోవడం కూడా ముఖ్యమే అన్నారు. ఈ మొక్కలు కేవలం పాఠశాల లోనే కాకుండా అందరూ తమ ఇంటి పరిసరాల్లో కూడా వీలైతే నాటాలని కోరారు. వాటి ద్వారా అందే పోషకాలు మనం మన ఇంటి వద్ద నేరుగా వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేయవచ్చన్నారు.

ఈ కరోనా కష్టాలను తప్పించుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఈవిధంగా కూడా సాధ్యమవుతుందని పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. ఇంకా ఇందులో గ్రామ పంచాయతీ సిబ్బంది రాజు, శ్రీధర్, గ్రామస్థులు కూడా పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ పై దాడి

Satyam NEWS

క్లారిటీ: పౌరసత్వ చట్టం వల్ల ఎవరికీ నష్టం లేదు

Satyam NEWS

ఆసరా పెన్షన్ దరఖాస్తులకు మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment