31.2 C
Hyderabad
May 12, 2024 00: 22 AM
Slider ముఖ్యంశాలు

రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు జరపాలి

#Farmers

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతుల నుండి కొనుగోళ్లు జరగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంపెన, మద్దుకూరు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడారు.

కేంద్రాల్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి రైతుల యొక్క వివరములు ట్యాబ్ ఎంట్రీలో నమోదు తీరు, ధాన్యం నాణ్యత ఏవిధంగా పరిశీలన చేస్తున్నారని పరిశీలించారు. టాబ్ లో ఆన్లైన్ ప్రక్రియ నమోదును పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ నిబంధనలు ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేస్తామని బరోసా ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లో నిల్వలు లేకుండా ఎప్పటి కపుడు మిల్లులకు రవాణా చేయాలని చెప్పారు. మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకుండా దిగుమతి చేసే విదంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు.

జాప్యం చేసే యజమానులకు నోటీస్ లు జారీ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డిఎం త్రినాధ్, పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి విషయానికీ ఆందోళన చెందవద్దు

Satyam NEWS

ఫిబ్ర‌వ‌రి 1న రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

వైభవంగా రాధా కృష్ణుల శోభాయాత్ర ప్రారంభం

Satyam NEWS

Leave a Comment