39.2 C
Hyderabad
April 28, 2024 11: 28 AM
Slider ఖమ్మం

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు

#police department

గ్రామాల్లో నిరుద్యోగ యువత చెడుమార్గంలో వెళ్లకుండా వారికి వుద్యోగ అవకాశాలు కల్పిచేందుకు పోలీసు శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా గ్రామాలలో నిరుద్యోగుల జాబితాను తయారు చేసిన పోలీసు శాఖ అధికారులు వారికి ప్రైవేట్ రంగంలో వుద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

అందులో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు త్వరలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తొలి జాబ్ మేళాను ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకు సంబందించి ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. జాబ్ మేళాను అర్హులంతా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ప్రచారంచేయనున్నామన్నారు.

అర్హతను బట్టి వుద్యోగం లభించేలా చూస్తామన్నారు. ఇప్పటికే అనేక కంపెనీలతో మాట్లాడుతున్నామని, ఈ మేళా సమాచారాన్ని అన్ని గ్రామాలకు చేరవేస్తామన్నారు. ఇందుకు సమబందించిన తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Related posts

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు గడ్డుకాలం దాపురించిందా?

Satyam NEWS

ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో ఉత్త‌రాంద్ర వాసి….!

Satyam NEWS

ఇన్వెస్టిగేషన్: కాశిపాడు హత్య కేసు మిస్టరీ వీడింది

Satyam NEWS

Leave a Comment