38.2 C
Hyderabad
May 2, 2024 19: 55 PM
Slider ముఖ్యంశాలు

10న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్-2023

#Chadalavada Nagarani

రాష్ట్రంలో పాలిసెట్-2023 నిర్వహణకు సర్వం సిద్దం చేసామని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా 61 పట్టణ కేంద్రాలు, 499 పరీక్షా కేంద్రాలలో 159144 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు.

వీరిలో 96429 మంది బాలురు, 62715 మంది బాలికలు ఉన్నారని, ఈ పరీక్షకు హాజరువుతున్న బాలికల సంఖ్య మొత్తం విద్యార్ధులలో దాదాపు 40శాతంగా ఉందని నాగరాణి వివరించారు. గిరిజన ప్రాంతాలలో చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఫలితంగా ఎస్సి విద్యార్థులు 26698 మంది, ఎస్టి విద్యార్థులు 9113 మంది హాజరవుతున్నారన్నారు.

సమయపాలన పాటిస్తూ విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గత సంవత్సరం (2022)తో పోలిస్తే ఈ సంవత్సరం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య దాదాపు 21000 పెరిగిందన్నారు. సాంకేతిక విద్యా శాఖ పరంగా చేపట్టిన ప్రత్యేక చర్యలు మంచి ఫలితాలను ఇచ్చినట్లు అయ్యిందన్నారు.

పాలిటెక్నిక్ విద్య ప్రయోజనాలు, తద్వారా అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పదవ తరగతి విద్యార్ధులకు అవగాహన కల్పించటంలో సఫలీకృతులయ్యారన్నారు.

ఇందుకోసం అయా పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు ప్రేరణ అందించారన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఉద్యోగ సాధకుల దినోత్సవాన్ని నిర్వహించటంతో, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్ధులు 4000కు పైబడి ప్లేస్‌మెంట్లు సాధించిన విషయం విద్యార్థి సమాజంలో విస్తరించిందని చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

మునుపెన్నడూ లేని విధంగా పాలీసెట్-2023 పరీక్షకు హాజరయ్యే ఎస్సి, ఎస్టి విద్యార్థులకు ఫీజు రాయితీ ఇవ్వగా, వారికి రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400 ఫీజుగా నిర్ణయించామని కమీషనర్ వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాధికారులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యపై అవగాహన కల్పించామన్నారు.

84 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 9000 మంది విద్యార్దులకు పాలిసెట్-2023 కోసం ఉచితంగా కోచింగ్ అందించి, స్టడీ మెటీరియల్ ను సైతం ఉచితంగానే అందచేసామని చదలవాడ నాగరాణి వివరించారు.

Related posts

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు

Satyam NEWS

చింతమడకలో ఇంటికి 10 లక్షలు- మరి మాకో?

Satyam NEWS

తొందరపడి ముందే కురిసింది

Satyam NEWS

Leave a Comment