33.7 C
Hyderabad
April 28, 2024 00: 15 AM
Slider తూర్పుగోదావరి

ప్రతి విషయానికీ ఆందోళన చెందవద్దు

#Yogacenter

ప్రస్తుత జీవనశైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక మానసిక  రుగ్మతకు గురవుతున్నారని దీన్ని  అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ మానసిక విశ్లేషకులు  ఏపీజే విను పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక రుగ్మతలు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ప్రతి విషయానికి  ఆందోళన  తగదన్నారు. కోపాన్ని అధిగమిస్తే చాలా వరకు మానసిక రుగ్మతలకు దూరం కావచ్చని  అన్నారు.

సానుకూల దృక్పధాన్ని అలవరుచుకోవాలి అని అన్నారు. రోజూ కొంత సేపు ధ్యానం చేయాలన్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని  విను  తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అడబాల  రత్న ప్రసాద్ ,బాపిరాజు, బుద్ధ రాజు సత్యనారాయణ రాజు,  రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

60వ రోజుకు చేరిన బిజెపి గడపగడప ప్రజా యాత్ర

Satyam NEWS

ఖరీదైన మద్యం బాటిళ్ల కార్టన్లతో పట్టుబడ్డ విలేకరి

Satyam NEWS

చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment