28.7 C
Hyderabad
May 5, 2024 09: 21 AM
Slider ఆదిలాబాద్

బందోబస్తు డ్యూటీలో కలిసిన తండ్రీకొడుకు…

#asisrinivas

తండ్రి ఏఎస్ఐ… కొడుకు ఎస్ఐ….. ఇద్దరూ వీఐపీ బందోబస్తు డ్యూటీలో కలిశారు…. ఎస్ఐ అయిన తన కుమారుడిని చూసి తండ్రి ఎంతో మురిపెంగా చూశాడు. తన తండ్రితో కలిసి వీఐపీ బందోబస్తు డ్యూటీ చేస్తున్నందుకు కొడుకు థ్రిల్ ఫీల్ అయ్యాడు. ఇది కాటారపు శ్రీనివాస్, కాటారపు సందీప్ కుమార్ ల కథ. ఎంతో ఆనందంగా పని చేస్తున్న ఈ తండ్రీ కొడుకులను చూసిన వారంతా కూడా సంతోషించారు.

కొమురం భీం వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ జోడేగాట్ కు వస్తున్నారు. ఆయన రాక కోసం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ లో ఎఎస్ఐ గా కాటారపు శ్రీనివాస్ పని చేస్తున్నారు. కొమురం భీం జిల్లా లో టాస్క్ఫోర్స్ ఎస్ఐగా సందీప్ కుమార్ పని చేస్తున్నారు. కొమురం భీం వర్ధంతికి రానున్న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాటారపు శ్రీనివాస్ ను ఉన్నతాధికారులు జోడేగాట్ పంపారు.

తన కొడుకు కూడా అక్కడకు వస్తున్న విషయం తెలుసుకుని ఆయన ఎంతో సంతోష పడి ఉంటారు. అయితే ఎవరి పనిలో వారు ఉన్నారు. అనుకోకుండా ఇద్దరు ఓకే చోట బందోబస్తు డ్యూటీ కి హాజరయ్యారు. అక్కడే వెనకాల కుర్చోని కొడుకును చూస్తూ తండ్రి మురిసిపోతుండడం అక్కడ ఒక రిపోర్టర్  కంట పడటంతో క్లిక్ మనిపించారు.

ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తండ్రి శ్రీనివాస్ 1985లో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. ఆయనకు 37 ఏళ్ల సర్వీసు వచ్చింది. కుమారుడు సందీప్ కుమార్ 30 ఏళ్లకే ఎస్ ఐ అయ్యాడు. మరి ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఏ తండ్రికైనా ఉంటుందా? ఉండదు. అందుకే శ్రీనివాస్ అంతగా సంతోష పడుతున్నాడు.

Related posts

ట్రెడిషన్: ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు

Satyam NEWS

టి‌డి‌పి గడియారాలు వచ్చేస్తున్నాయ్

Murali Krishna

ఎలక్షన్ కోడ్ వచ్చినా కార్యాలయాన్ని ఖాళీ చేయని మంత్రి

Satyam NEWS

Leave a Comment