33.7 C
Hyderabad
April 30, 2024 02: 23 AM
Slider నల్గొండ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి

#munugoducongress

పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్న భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని మునుగోడు నియోజకవర్గ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ నాయకులు పొలాగోని సైదులు గౌడ్,ఉకోండి యం పి టి సి కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపల్లి రాజు,జాల లింగయ్య, గంధం లింగుస్వామి,బోయపల్లి శ్రీను, సోమగాని మహేష్ తదితరులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు శనివారం తమను కలిసిన మీడియాతో వారు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు ప్రపోజల్ చేసిందే యం.పి కోమటిరెడ్డి అయినప్పుడు ప్రచారానికి రాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్నది బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. మూడేండ్ల నుండి బిజెపి కి టచ్ లో ఉన్నాను అంటూ స్వయంగా ఆయన తమ్ముడు మునుగోడు మాజీ యం ఎల్ ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంగీకరిస్తున్నందున ఇప్పుడు అన్న కూడాపార్టీలో ఉంటూ కోవర్ట్ చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నాయన్నారు.

కుటుంబ స్వార్థం కోసం రాజీనామా చేసింది చాలక నియోజకవర్గ అభివృద్ధికి రాజీనామా చేసమంటూ రాజగోపాల్ రెడ్డి చెబుతున్న మాటల్లో నిజం లేదని స్వయంగా ఆయన మాటల్లోనే తేలిపోయిందన్నారు.అటువంటి అన్న తమ్ముళ్లు అవకాశం దొరికితే యావత్ తెలంగాణాను అమ్ముకుంటురాని వారు దుయ్యబట్టారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాక ఆయన రాజీనామా చేయలేదని కుటుంబానికి సరిపడా నిధులు సమకూర్చుకోవడానికే రాజీనామా చేశారని తెలిపోయిందన్నారు.

మునుగోడు నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపిస్తే ఆ నమ్మాకాన్ని మోదీ,అమిత్ షాలకు అమ్ముకుని నయావంచనకు పాల్పడ్డారని వారు విమర్శించారు. అటువంటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై 24 గంటలవ్యవధిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే తామంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు.

Related posts

ఇన్వెస్టిగేషన్: కాశిపాడు హత్య కేసు మిస్టరీ వీడింది

Satyam NEWS

యూట్యూబ్ ఛానెళ్లలో రెచ్చగొట్టే ప్రసారాలపై కేసులు

Satyam NEWS

పాముతో సెల్ఫీ.. కందుకూరులో యువకుడు మృతి

Bhavani

Leave a Comment