32.7 C
Hyderabad
April 27, 2024 00: 43 AM
Slider ఆదిలాబాద్

ట్రెడిషన్: ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు

nagoba jatara

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న నాగోబా జాతర సందర్భంగా మెస్రం వంశీయులు చేపట్టిన ఆచారాలు నేటితో ముగిశాయి.రాత్రి మండ గాజిలి పూజలు నిర్వహించి ఉదయం బేతాళ విన్యాసాలు చేసి ఈ సందర్భంగా నాగోబా జాతరలో తమ ఆచారాలను నేటితో ముగించారు. ఈ రోజు సాయంత్రం తిరిగి శ్యాంపూర్ లోని బుడుం దేవ్ వద్దకు ఎడ్లబండ్లపై బయలుదేరారు.

ఈ రోజు మెస్రం వంశీయులు ఉదయం తమ సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్న ఆచారాల ప్రకారం నేడు తమ కానుకలుగా వచ్చిన ప్రసాదాలను తీసి అందరు మేస్రం వంశీయులు పంచుకున్నారు. ఆపై నాగోబా గోవాడ సమీపంలో కొత్త కోడల్ల పరిచయం చేసి వారికి ఈ రోజుతో తమ వంశీయుల పరంగ పెద్దల ఆశీస్సులు పొంది కార్యక్రమం నిర్వహించారు.

మిశ్రమంతో పెద్దలు తమ సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం ప్రకారం తమ (కాటి) కర్రలతో కర్ర విన్యాసాలు చేస్తూ బేతాళ విన్యాసాలను ప్రదర్శించారు. ఆపై తమ జాతర అంత మంచిగా కొనసాగుతుందని ఒక దైవం వల్ల అంతా మంచే చివరిసారిగా నాగోబాకు మొక్కులు చెల్లించి అక్కడినుండి తమ డోలు వాయిద్యాల మధ్య అందరూ కలిసి నృత్యాలు చేసి చివరి మొక్కులు చెల్లించారు.

Related posts

విజయనగరం ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం…!

Satyam NEWS

రెండు లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

Sub Editor

ఇసుక డంపుల సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

Satyam NEWS

Leave a Comment