29.7 C
Hyderabad
May 4, 2024 05: 32 AM
Slider ఆదిలాబాద్

లోటస్ ఫీడ్ ది నీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నఅన్నదానం

#feed the needy

లోటస్ ఫీడ్ ది నీడీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఫుట్ పాత్ ల పైన వున్న, అభాగ్యులకు, కడుపు నింపలనే ఉద్దేశ్యంతో, లోటస్ టీమ్ ఆధ్వర్యంలో ప్రతి రోజు సాయంత్రం నిత్య అన్నదానం చేస్తున్నారు.

ఈ కార్యక్రమం 365 రోజుల పాటు కొనసాగేలా ప్రణాళిక వేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు వెంకన్న యాదవ్, వైద్య దిలీప్, కపుర్ ప్రవీణ్ పేర్కొన్నారు.

దీనికి లోటస్ టీమ్ లో వున్న సభ్యులు దేవేంద్ర , ధమ్మపల్, మహేష్, వెంకటేష్, స్వప్నిల్, సాయి, గజనన్,అమూల్, ఆశన్న, రవి రెడ్డి, శ్రీనివాస్, సాయి లు తమ సమయాన్ని, సహాయాన్ని అందిస్తున్నారు.

వంతుల వారీగా చందాలు వేసుకుని వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలు వున్నా, లేకున్నా, తమ సేవను ఎట్టి పరిస్థితిలోనూ ఆపడం జరగదని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో ఎటువంటి స్వంత లాభం లేదని, కేవలం , సామాజిక అంశం గానే తాము చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం కోసం ఆర్థికంగా తమకు సహకరిస్తున్న గండ్రత్ సంతోష్ కి ఎప్పుడూ రుణ పడి ఉంటామని తెలిపారు.

Related posts

కరోనా ఎలర్ట్: సమిష్టి కృషితో కరోనాను తరిమికొడదాం

Satyam NEWS

పుష్కరాల్లో సంగీత విభావరి

Sub Editor

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment