Slider చిత్తూరు

రాయలసీమ నీటి కోసం సంఘటితంగా పోరాటం చేద్దాం

#rayalaseema

రాయలసీమలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐ కానిక్ (తీగల) వంతెనకు బదులు “బ్యారేజ్ కం బ్రిడ్జి” నిర్మాణం చేపట్టాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామికి, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి కి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కి, రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డి కి రాయలసీమ పోరాట సమితి తరపున వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న “అపర్ భద్ర” ప్రాజెక్టు కారణంగా భవిష్యత్తులో రాయలసీమలోని అన్నీ జిల్లాలలో త్రాగునీరు సాగునీరు లేక “ఎడారిగా” మారుతుందని ఆయన అన్నారు. రాయలసీమ జిల్లాలలోని ఎమ్మెల్యేలు,ఎంపీలు అధికార,ప్రతిపక్ష పార్టీ నాయకులు జెండాలు అజెండాలు పక్కనపెట్టి ప్రభుత్వ పరంగా అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించాలని డిమాండ్ చేశారు.

సీమ ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పై వత్తిడి తేవాలని ఆయన సూచించారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి ఢిల్లీలో, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడలో ఉన్నందున ప్రత్యక్షంగా కలవలేకపోయారు. ఈ మేరకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పై సీమ ప్రాంత శాసనసభ్యులుగా, ఎంపి గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ప్రజా ప్రతినిధులు అందరూ హామీ ఇచ్చారు.

రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో ప్రజలనుంచి సంతకాల సేకరణతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం ఇతర అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులతో చర్చించి అందరిని ఏకతాటి పైకి తీసుకొచ్చి ఉద్యమ కార్యాచరణను స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకటిస్తామని నవీన్ తెలియజేశారు.

Related posts

జర్నలిజం ఫస్ట్…అంటే అర్ధం ఏమిటి?

Satyam NEWS

సీతా సమేత కోదండ రాముడి కల్యాణం టీవీల్లో చూడండి

Satyam NEWS

వుమెన్స్ డే: మార్కెట్ కమిటీ అధ్యక్షురాలికి సన్మానం

Satyam NEWS

Leave a Comment