29.7 C
Hyderabad
May 6, 2024 03: 13 AM
Slider కడప

క్వారీ పేరిట ఇసుక అక్రమ దందా

#cheyyeru

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరు మార్గ మధ్యమంలోని చెయ్యేరు నది ఇసుక అక్రమార్కులకు సిరుల పంట కురిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అనుమతులు ఒకచోటైతే మరోచోట ఇసుకను తవ్వేస్తూ దొరికిన కాడికి అధికార పార్టీ నేతలు దోచుకొనే పనిలో పడ్డారు.

గతంలో రాష్ట్రమంతా ఒకటే కాంట్రాక్టరు వుండగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఇసుక క్వారీలను జిల్లాలోని ఒక ముఖ్యనేత క్వారీల వారీగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారు. పెట్టుబడి అధికంగా వుండడంతో అధిక ఆదాయం కోసం క్వారీని దక్కించుకున్న నేతలు అడ్డదారిలో ఇసుకను దోచేస్తున్నారు. ప్రస్తుతం రాజంపేట పరిధిలోని మందరం గ్రామ పంచాయితీలో మాత్రమే ఇసుక క్వారీకి అనుమతులున్నాయి. నందలూరు మండలంలోని ఆడపూరు టంగుటూరు క్వారీలు ప్రస్తుతం మూతబడ్డాయి.

దీనితో మందరం క్వారీని దక్కించుకొన్న ఓ నేత నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తూ చెయ్యేరు నదిని గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క శాఖ అధికారి పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రధానంగా రాజంపేట మండల పరిధిలోని మందరం క్వారీకి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అక్కడ నుండి ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులిచ్చిన ప్రాంతంలోనే ఇసుకను తరలించాల్సి వుంది.

అయితే అధికార బలం అండతో నందలూరు మండల పరిధిలోని ఆడపూరు సరిహద్దుల్లో ఇసుకను తోడేస్తూ ఎంచక్కా అమ్మేసుకుంటున్నారు. ఇంకో అడుగు ముందుకేసి రాజంపేట మీదుగా ఇసుకను తరలించాల్సి వుండగా నందలూరు మండల పరిధిలోని ఆడపూరు గ్రామం నుండి ఇసుకను అమ్ముతుండడం విశేషం. చెయ్యేరు నదిలో దర్జాగా రోడ్డు వేసి  అనువైన ప్రాంతాల్లో ఆ నాయకుడు అనుకున్నంత విధంగా పలు చోట్ల భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తూ ట్రిప్పర్ల ద్వారా కొనుగోలుదారుల గృహాలకు చేరుస్తుండడం విశేషం.

ఈ క్వారీలో ఎక్కడ కూడా సంబంధిత శాఖలకు చెందిన రెవెన్యూ, భూ గర్భ గనుల శాఖ, ఎస్‌ఈబి అధికారుల జాడ కనపడకపోవడం వారు పట్టించుకోకపోవడంతో చెయ్యేరు నదిలో ఇసుక సంబంధిత కాంట్రాక్టరుకు బంగారం పండిస్తోంది. క్వారీ అనుమతులు ఒకచోటైతే ఇంకో చోట ఇసుకను ఎత్తడమే కాకుండా మండల సరిహద్దులు దాటి ఇంకో మండలం మీదుగా అమ్మకాలు ఎలా సాగిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మరి చెయ్యేరు నదిలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా కొనసాగుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకుండా ఎందుకు వున్నారని పెద్ద ఎత్తున అందరికీ అమ్యామ్యా అందుతుండడం వల్లే ఆ వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ విషయాలు అటుంచితే ఆడపూరు సమీపంలో క్వారీ నిర్వహించడం మూలంగా భూ గర్భ జలాలు అడుగంటి త్రాగు, సాగునీటి సమస్యలు తలెత్తుతాయనే ఉద్ధేశ్యంతో కొందరు గ్రామస్థులు గతంతో పాటు రెండు రోజుల క్రితం ఇక్కడ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు.

అయితే మా వద్ద అన్ని రకాల అనుమతులున్నాయని కొందరు కావాలనే క్వారీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సంబంధీత కాంట్రాక్టర్‌ ఫేర్కొనడం జరిగింది. ఇదిలా వుండగా క్వారీ రాజంపేటలో వుంటే నందలూరు మీదుగా చెయ్యేరు నదిలో నిబంధనలకు విరుద్దంగా చెయ్యేరు నదిలో రోడ్లు వేసి ఇసుకను ఎలా తరలిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏదిఏమైన్పటికీ చెయ్యేరు నదిలో నిర్వహిస్తున్న క్వారీలపై ఆది నుండి అనేక అక్రమాలు చోటుచేసుకోవడంతో పాటు నిబంధనలను తుంగలో తొక్కి ఇసుకను అడ్డుగోలుగా తరలిస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చి అనేక మందిపై కేసుకు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే. మరి ఇంత జరుగుతున్నా ప్రస్తుతం ఇసుక క్వారీలపై పర్యవేక్షణ కొరవడంతో పాటు అధికారుల అండదండలతో ఇసుకను విచ్చలవిడిగా అమ్మేసుకుంటూ దోపిడి చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా భూ గర్భ గనుల ఖాఖ, రెవెన్యూ, ఎస్‌ఈబి అధికారులు చెయ్యేరు నదిలో జరుగుతున్న అక్రమాలపై దృష్షి సారించి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు కోరుతున్నారు.

Related posts

ఈత సరదా తో వెళితే ముగ్గురి ప్రాణాలు తీసిన పులిగుండాల

Satyam NEWS

రీవ్యూజ్డ్:డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికకు ఓఐసి నో

Satyam NEWS

22న పెళ్లి పీటలెక్కబోతున్న జవాన్ ను కూడా చంపేశారు

Satyam NEWS

Leave a Comment