30.7 C
Hyderabad
April 29, 2024 06: 07 AM
Slider ఆధ్యాత్మికం

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో అన్నదానం

#paiditalli

ఉత్తరాంధ్ర కల్పవల్లి.. విజయనగరం ఆడపడుచు, భక్త జనభాంధవి, భక్తుల కొంగు బంగారం, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి  పైన ఉండాలని నగర మేయర్  వెంపడాపు విజయలక్ష్మి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి లు అభిలషించారు. మంగళవారం నాడు  పైడితల్లమ్మ వారి దేవస్థానం పాలకమండలి, అధికారుల నిర్వహణలో జరిగిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు.

ఆలయానికి చేరుకోగానే  ఆలయ నిర్వాహకులు ,అధికారులు వీరికి సాగర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య వీరు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద ఆశీర్వచనం తరువాత ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీరి చేతుల మీదుగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు.

ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ సిరి మాను సంబరం, ఉయ్యాల కంబాల ఉత్సవం తరువాత , గత 20 ఏళ్ల నుంచి భక్తులకు అన్నప్రసాద   కార్యక్రమాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.  అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావించి  తీసుకోవడం ఈ ఏడాది అన్నప్రసాద కార్యక్రమాన్ని పదివేల మందికి పైగా భక్తులు స్వీకరించడం అమ్మవారి ఉత్సవాలను, అన్నప్రసాద కార్యక్రమాన్ని అధికారులు, పాలక మండలి సభ్యులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్  రేవతి దేవి,ఆలయ కార్య నిర్వహణ అధికారి కిషోర్ కుమార్, దేవస్థానం పాలకమండలి సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్స శ్రీను, తాడి సురేష్, అచ్చిరెడ్డి, చిల్లా పుష్ప, నక్క జ్యోతి, గాదం ఉమా,  బలివాడ పార్వతి, రామ్ సింగ్ సూరమ్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Related posts

శెట్టూలురులో సిసి రోడ్డు పనుల ప్రారంభం

Satyam NEWS

హద్దులు దాటుతున్న చైనా సైన్యం.. సరిహద్దుల్లో వంతెన ధ్వంసం..

Sub Editor

పీజీ అడ్మిషన్లకు వి యస్ యూ ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహించదు

Satyam NEWS

Leave a Comment