29.7 C
Hyderabad
May 4, 2024 05: 30 AM
Slider విజయనగరం

తొలి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం లోనే సస్పెండ్ అయిన సూపర్ వైజర్

#VijayanagaramMunicipality

తొలిసారిగా విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్…స‌మావేశ‌మైంది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌…ఎన్నో అవాంత‌రాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు విజ‌య‌న‌గ‌రం పురపాల‌క సంఘం కాస్త‌…న‌గ‌ర పాల‌క సంస్థ‌గా మారింది. ఈ నేప‌ద్యంలో తొలి సారి న‌గ‌ర పాల‌క సంస్థ లోని యావ‌న్మంది అంటే 50 డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు..మేయ‌ర్ అధ్య‌క్ష‌త‌న అత్య‌వ‌స‌రంగా స‌మావేశమ‌య్యారు.

మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మీ అధ్య‌క్ష‌త‌న‌.. 50 డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు…స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భద్ర స్వామిలు…విజ‌య‌న‌గ‌రంలోని న్యూపూర్ణ ధియేట‌ర వ‌ద్ద కొత్త‌గా కొలువు తీరిన మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫీసులో స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది.

స‌మావేశం కాగానే ముక్త కంఠంతో  స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి.. 50 డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు…అనుమ‌తితో. న‌గ‌ర పాల‌క సంస్థ ఉద్యోగి .సూప‌రవైజ‌ర్ ర‌వి సస్పెండ్  అయ్యారు.న‌గ‌ర పాల‌క సర్వ స‌భ్య  స‌మావశంలో..దిగువ స్థాయి అధికారులెవ్వ‌రూ  ప‌ని చేయ‌టం లేద‌ని..గ‌డ‌చిన మూడు నెల‌ల నుంచీ ప‌ని చేయ‌క‌పోయినా…చేస్తున్న‌ట్టు సంత‌కాలు పెట్టి…ద‌ర్జాగా జీతం తీసుకుంటున్నార‌ని న‌గ‌ర  పాల‌క సంస్థ ఆరోపించింది.

తొలుత స‌మావేశంలో న‌గ‌ర పాల‌క సంస్థ  క‌మీష‌న‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ…సీఎం ఆదేశాల మేర‌కు 100 రోజుల పాటు క్లీన్ అండ్ గ్రీన్ ప‌నులు చేప‌ట్టాలన్న అజెండాను చ‌దివి వినిపించారు. అనంత‌రం ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర స్వామి మాట్లాడుతూ..ప్ర‌జా ప్ర‌తినిథులుగా తామెంత మొత్తుకున్న చెప్పినా..ఏ ఒక్క అధికారి స‌కాలంలో స‌క్ర‌మంగా ప‌ని చేయ‌క‌పోని కార‌ణంగా పర్య‌వ‌స‌నంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోందని పేర్కొంటూ.. న‌గ‌ర పాల‌క సంస్థ‌లో సూప‌ర్ వైజ‌ర్ ర‌వి అనే ఉద్యోగి  గురించి స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో అటెండెంట్ రిజ‌స్ట‌ర్ ను చూపించి….విధులు ఎగ్గొట్ట‌డంపై మాట్లాడారు.

ఇదే అంశంపై కార్పొరేట‌ర్లు అంద‌రూ స‌ద‌రు ఉద్యోగిని సస్పెండ్ చేయాల‌ని ముక్త కంఠంతో తెలియ చెప్ప‌డంతో…త‌క్ష‌ణం సద‌రు సూప‌ర్ వైజ‌ర్ ర‌విని విధుల నుంచీ స‌స్పెండ్ చేస్తున్నట్టు  మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ ముందే క‌మీష‌నర్ వ‌ర్మ తెలియ చేసారు.

తొలిసారిగా స‌మావేశ‌మైన ఈ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మీ తో పాటు డిప్యూటీ మేయ‌ర్ ముచ్చు రామ‌లక్ష్మీ, స్టాండింగ్ కౌన్సిల్ మెంబ‌ర్ రాజేష్, ఎమ్మెల్యే స్వామి కూతురు 29 వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ శ్రావ‌ణి, 33 వ వార్డు కార్పొరేట‌ర్  రంగాతో పాటు 50 డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు.. వీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Related posts

విషవాయువు లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Satyam NEWS

ఐజేయూ జర్నలిస్టుల పోరు బాట

Satyam NEWS

ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

Leave a Comment