28.7 C
Hyderabad
April 28, 2024 09: 37 AM
Slider వరంగల్

గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్ళు దగ్ధం: 9 లక్షల మేర ఆస్తి నష్టం

#fire accident

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామానికి చెందిన రావుల దేవేందర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. గ్రామస్థులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దేవేందర్ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.

వాటిని అదుపు చేసేందుకు దేవేందర్ కుటుంబ సభ్యులు ప్రయత్నించగా మంటలు చెలరేగడంతో అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించి పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాన్లు,  గృహోపకరణాలు పూర్తి స్థాయిలో కలిపోవడంతో పాటు నగదు, బంగారం మంటల్లో దగ్ధమైనట్లు వివరించారు.

ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 9 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఇల్లు కాలడంతో నిరాశ్రయులైన దేవేందర్ కుటుంబానికి రెడ్లవాడ సర్పంచ్ రావుల శ్రీలత ప్రసాద్ కనీస సౌకర్యాలు కల్పించి వారికి అండగా నిలిచారు.

Related posts

భార్య చాటు అధికారం చెలాయించే భర్తల కట్టడికి ఆదేశాలు

Satyam NEWS

ఎలెక్ర్టిఫికేషన్: విద్యుత్ షాక్ కు గురై ముగ్గురి మృతి

Satyam NEWS

ఏపీలో ఖర్చు ఎంత? అప్పు ఎంత?

Satyam NEWS

Leave a Comment