అనుభవం లేని డ్రైవర్లకు అధికారులు ఆర్టీసీ బస్సులను అప్పజెప్పారు. నిద్ర మత్తులోనే, మద్యం సేవించో బస్సులను నడుపుతున్నారు ప్రైవేట్ డ్రైవర్లు. ఫలితంగా తరచు ఆర్టీసీ బస్సులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సర్వీస్ రోడ్డు వద్ద ఆగివున్న ట్రాక్టర్ ట్రాలీని ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సర్వీస్ రోడ్డుపై రైతులు మక్కలను ఆరబోసి ట్రాలీలో లోడ్ చేసి పక్కన ఆపారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఆగివున్న ట్రాలీని ఢీకొట్టాడు. దాంతో బస్సు ఎడమ వైపు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ట్రాలీ బోల్తా పడటంతో ట్రాలీలో ఉన్న మక్కలు నేలపాలయ్యాయి. బస్సు ఢీకొన్న సమయంలో రోడ్డుపై రైతులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది
previous post