29.7 C
Hyderabad
May 4, 2024 04: 11 AM
Slider సినిమా

ఆదిపర్వంలో ఎర్రగుడిని కబ్జా చేసిన మంచు

#adiparvam

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై  అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్(AI)  కలయికలో నిర్మిస్తున్న “ఆదిపర్వం” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 1974 – 1990 మధ్య కాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అమ్మోరు అరుంధతి చిత్రాల తరహా  ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ తో మధ్య జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పాలి.

ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఆదిపర్వం.  గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలిచారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అలాగే  హై ఓల్టేజ్ ఆక్షన్ డ్రామాగా అలాగే ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ‘ఈ చిత్రం లో మంచులక్ష్మి ప్రసన్న ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మంచు లక్ష్మిప్రసన్న పుట్టిన రోజుని పురస్కరించుకుని  ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు.

తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయి. అన్వికా ఆర్ట్స్ మరియు అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థల సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రాన్ని మలిచానన్న తృప్తి మిగులుతుందని, మంచులక్ష్మి గారి క్యారెక్టర్ ఆవిడ పెర్ఫామెన్స్ కూడా మెమొరబుల్ గా ఉంటాయ’ని   సంజీవ్ మేగోటి ఉటంకించారు.  

ఈ చిత్రంలో ఆదిత్యఓం , ఎస్తేర్ , సుహాసిని ,శ్రీజిత ఘోష్,  శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ , సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి , హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్,  యోగి కాత్రి , మధు నంబియార్, బృంద, స్నేహ అజిత్  , అయేషా, జ్యోతి, శ్రావణి, గూఢా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, డీఎస్పీ మొదలగువారు ప్రధాన పాత్రలు పోషించారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ “రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా మొదలయి కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రంగా రూపుదిద్దారు దర్శకులు సంజీవ్ మేగోటి” అని చెప్పారు. ఫైట్స్ మరియు గ్రాఫిక్స్ చాలా ప్రశంసలందుకుంటాయని సహనిర్మాత గోరెంట శ్రావణి చెప్పారు. 

నటీనటులు:

మంచు లక్ష్మి, ఆదిత్యా ఓం, శివ కంఠమేనని, శ్రీజితాఘోష్, వెంకట్ కిరణ్, ఈస్టర్ నోరాన్హా, సుహాసిని, సత్యప్రకాశ్, జెమిని సురేష్, హారీ జోష్, బృందా వనితారెడ్డి, స్నేహా అజిత్ (మలయాళం హీరోయిన్) సమ్మెట గాంధీ, ఢిల్లీ రాజేశ్వరి, జబర్దస్త్ నవీన్, యోగేష్ కాత్రి (దసరా మూవీ ఫేమ్) అపూర్వశ్రీ, ఆయేషా, మధు నంబియార్, రాధాకృష్ణ.

సాంకేతిక నిపుణులు:

డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఎన్ ఎన్ హరీష్, సంగీతం మాధవ్ సాయిబాబా, ఓపెన్ బనానా ప్రవీణ్, సంజీవ్ మెగోటే, బి.సుల్తాన్ వాలీ, లుబీచ్ లీ, గీతరచయిత: సాగర నారాయన్, ఎడిటింగ్: ప్రవీణ్ శేఖర్ పసుపులేటి, పోరాటాలు: నటరాజ్, నృత్యం: సన్ రేస్ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్: కె వి రమణ, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, నిర్మాణం: అన్వికా ఆర్ట్స్ మరియు AI (అమెరికా ఇండియా) ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: సంజీవ్ మెగోటి   

Related posts

పులివెందులలో తుపాకీ కాల్పులు: ఇద్దరు మృతి

Satyam NEWS

9, 10 తరగతులకు ఐఐటీ ఫౌండేషన్ @ టెలిగ్రామ్ యాప్

Satyam NEWS

అంబేద్కర్ పేరు చెప్పుకునే యోగ్యత కూడా జగన్ రెడ్డికి లేదు

Satyam NEWS

Leave a Comment