బిచ్కుంద ప్రభుత్వ జునియర్ కళాశాల జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ 2020 ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ జూనియర్ కళాశాల నుండి ఎస్బిఐ బ్యాంక్ చేరు కోగా అక్కడి మేనేజర్ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ అభినందించారు. ఎస్బిఐ బ్యాంక్ బిచ్కుంద నుండి ర్యాలీ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా, ప్రభుత్వ ఆస్పత్రి వరకు చేరి అక్కడి నుండి గ్రామపంచాయతీ చేరుకొంది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లగా ఎస్సై కృష్ణ తమ మద్దతును తెలిపి అభినందించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్యామ్ సన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ బిచ్కుంద జూనియర్ కళాశాలలో ముగిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ,ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్యామ్ సన్ కళాశాల అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
previous post
next post