Slider హైదరాబాద్

పేద విద్యార్ధుల నుంచి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి

#amberpet

పేద విద్యార్ధుల వద్ద కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయు జేఏసీ న్యాయ విద్యార్థి సేన కోరాయి. అంబర్పేట్ పాఠశాల సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డిని నేడు ఓయు జేఏసీ న్యాయ విద్యార్థి సేన అధ్యక్షుడు శ్రీకాంత్ కలిశారు. ఆన్లైన్ ఫీజు, ప్రమోషన్ ఫీజు పేరుతో వసూలుకు పాల్పడుతున్నారని, స్కూల్స్ వాటిని అరికట్టాలని వినతి పత్రం సమర్పించారు. కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని బస్తీలో నివసించే పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి  అబ్దుల్అర్షడ్, బిరాదర్ సూరజ్ పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట్

Related posts

ఇప్పటికి తెలిసిందా విశాఖ ఉక్కు గొప్పతనం?

Satyam NEWS

నేచురల్ స్టార్ నాని ట్రైలర్ రిలీజ్ చేసిన 125 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం “మానాడు”

Satyam NEWS

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ చదలవాడ

Satyam NEWS

Leave a Comment