హైదరాబాద్,నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా కుమారుడు మృతిచెందాడు. దంపతులు మద్దిమడుగు ప్రసాద్ (36), మద్దిమడుగు రమణ(30), కొడుకు అవినాష్(12) మృతిచెందారు.మృతులు పీఏ పల్లి మండలం అక్కంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. అలాగే కారు బోల్తా పడి మణిపాల్ (18), మల్లిఖార్జున్(18) మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పరామర్శించారు.
previous post
next post