21.7 C
Hyderabad
December 2, 2023 04: 07 AM
Slider కడప

వైఎస్‌ భాస్కర్ రెడ్డికి బెయిల్‌

#ysbhaskarreddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్ రెడ్డికి బెయిల్‌ లభించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.అతడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎస్కార్ట్‌ బెయిల్‌లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్‌ వెహికిల్‌ ఉంటాయి.

ఎస్కార్ట్‌ బెయిల్‌లో వీళ్లు భాస్కర్‌ రెడ్డి వెంట ఉన్నారు. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గత వారం సీబీఐ కోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, చంచల్ గూడ జైల్లో భాస్కర్ రెడ్డికి తగిన వైద్య చికిత్స అందిస్తున్నారని సీబీఐ లాయర్ కోర్టును తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. నేడు వైఎస్‌ భాస్కర్ రెడ్డికి బెయిల్‌ ఇస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

Related posts

కొత్త సంవత్సరంలో మాజీమంత్రి జూపల్లి కొత్త నిర్ణయం?

Satyam NEWS

తిరుమల మాడవీధుల్లో కోలాహలంగా కోలాటం

Satyam NEWS

కడప జిల్లాలో శ్రమదానంతో జనసేన రోడ్ల మరమ్మతులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!