38.2 C
Hyderabad
April 29, 2024 21: 01 PM
Slider మహబూబ్ నగర్

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

వనపర్తిలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

జిల్లా పరిషత్ చైర్మన్, లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, షేక్ యాష్మీన్ భాష, జిల్లా ఎస్పీ, అపూర్వరావు, వనపర్తి మున్సిపల్ చైర్మన్, గట్టుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్, వాకిటి శ్రీదర్ అమరుల పోలీసు కుటుంబ సభ్యులు, అధికారులు సిబ్బందితో కలిసి అమరవీరుల అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ప్రతిఏటా ఘనంగా ఫ్లాగ్ డే

ఈ సందర్భంగా నిర్వహించిన స్మృతి పరేడ్ కు పరేడ్ కమాండర్ గా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21వ తేదీన CRPF ఎస్సై, కరమ్ సింగ్ నాయకత్వం లోని భారత జవాన్లు ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, వీరి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు మరియు ఆర్మీ శాఖలకు చెందిన 264 మంది అధికారులు వివిధ సంఘటనలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి, దేశ రక్షణ కోసం వీరమరణం పొందారని వారి పేర్లు అదనపు ఎస్పీ చదివి వినిపించారు.

వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను అందజేయడం, కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు అందించే నిజమైన నివాళి. పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు బ్యానర్లు జిల్లాలో, పోలీసు స్టేషన్ లలో ఓపెన్ హౌజ్ కా‌ర్యక్రమము, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, రక్త దాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు, తదితర కార్యక్రమాలు ఈ నెల 31 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎస్పీ కలిసి అమరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పరామర్శించి శాలువాతో సన్మానించి చిరుకానుకలు అందజేశారు.
అనంతరం పాలిటెక్నిక్ కళాశాలమైదానం నుండి రాజీవ్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా మీదుగా జిల్లా పోలీసు కార్యాలయం వరకు అమర పోలీసువీరులకు జోహార్ జోహార్ నినాదాలు చేస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో అమర పోలీసు కుటుంబ సభ్యులతో జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమస్యలు, సంక్షేమం గురించి ఎస్పీ చర్చించి వారికి అండగా ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్,లోకనాథ్ రెడ్డి, వనపర్తి అదనపు ఎస్పీ ,షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పి ఆనంద రెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్, గట్టుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి, శ్రీధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, జగన్, వెంకట్, వనపర్తి సీఐ, ప్రవీణ్ కుమార్,
కొత్తకోట సీఐ, శ్రీనివాస్ రెడ్డి రెడ్డి, ఆత్మకూరు సీఐ, రత్నం, వనపర్తి పట్టణఎస్సై, యుగంధర్ రెడ్డి, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు,వినోద్ , సురేందర్ బాబు, ఎస్పీ పీఆర్వో, రాజగౌడ్, మరియు అమర పోలీసు కుటుంబసభ్యులు పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పత్రిక మీడియా మిత్రులు పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పుష్పాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పొలిశెట్టి బాలకృష్ణ సీనియర్ విలేకరి సత్యం న్యూస్ నెట్

Related posts

‘‘భారత్ పాకిస్తాన్ ను ఓడించలేదు’’: ఆస్తానా ప్రేలాపన

Satyam NEWS

ఫ్లై హై: వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

Satyam NEWS

ట్విట్టర్ సీఈవో పదవి నుంచి వైదొలగనున్న ఎలోన్ మస్క్

Bhavani

Leave a Comment