38.2 C
Hyderabad
May 3, 2024 22: 14 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో వరద నివారణకు మాన్సూన్ ఏమర్జెన్సీ బృందాలు

GHmC

భారీ వర్షాల కు ఏర్పడిన  వరద వలన ఎలాంటి అస్తి, ప్రాణ నష్టం వాటిల్ల కుండా జి హెచ్ ఏం సి విశేష ప్రాధాన్యత నిచ్చింది. నగరం లో ప్రమాదకర మైనర్, మేజర్ నాల ల  ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నిలిచిన నీరు  వెంటనే తొలగించేందుకు  మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను జి హెచ్ ఏం సి ఏర్పాటు చేసింది.

ప్రమాదాల నివారణకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చోట 24 గంటల పాటు షిఫ్ట్ సిస్టమ్ లో పని చేసే విధంగా  ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తాయి  ఈ బృందాలు ప్రజలను అప్రమత్తం చేసి  నష్టం జరగకుండా వీరు కృషి చేస్తారు. బృందాలకు వారి భద్రత తో పాటు అవసరమైన కావల్సిన మెటీరియల్ అందజేశారు.

వర్షం నేపథ్యంలో  నీట నిలిచిన, లోతట్టు ప్రాంతాల్లో   ముంపు ఏర్పడినప్పుడు   తొలగించేందుకు  జూన్ నుండి  అక్టోబర్ వరకు ఈ బృందాలను జి హెచ్ ఏం సి నియమించింది. మొబైల్ మాన్సూన్ బృందం, మొబైల్ మాన్సూన్ బృందం,స్టాటిక్  లేబర్ టీమ్ లను  జి హెచ్ ఏం సి ఏర్పాటు చేసింది.

ఈ బృందాలు ఇళ్లలో, రోడ్డు పై చేరిన వరద నీటిని తొలగించడం, వర్షం కురుస్తున్న నేపథ్యం లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటారు. నాళాల లో కొట్టుకొని వచ్చిన వ్యర్ధాలను తొలగించి  వరద ప్రవాహాన్ని సాఫి గా వెళ్లేందుకు  చర్యలు తీసుకుంటారు. ప్రధాన, అంతర్గత రోడ్ల లో ఉన్న మ్యాన్ హోల్స్  వద్ద గాని రోడ్డు పై నున్న  మట్టి,ఇసుక  తొలగించి శుభ్రం చేయడం మే కాకుండా  అందులో నీరు  నేరుగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటారు.

వీరిని జోనల్, డిప్యూటీ కమిషనర్ లు పర్యవేక్షణ చేస్తారు. జి హెచ్ ఏం సి పరిధిలో  మాన్సూన్ అత్యవసర టీమ్ లు  మొత్తం   168 టీమ్ లను ను  ఏర్పాటు చేశారు. అందులో 64  మొబైల్ మాన్సూన్ అత్యవసర టీమ్ లను, 104 మొబైల్ మాన్సూన్ అత్యవసర టీమ్ లను ఏర్పాటు చేశారు.

అందులో  టీమ్ కు ఒక్కంటికి వాహనం, 4 గురు మంది కూలీ లు  ఉంటారు  వీరు రెండు షిఫ్ట్ లలో 24 గంటల పాటు పని చేస్తారు. అదనంగా మరో  160 స్టాటిక్ లేబర్ టీమ్ లను ఏర్పాటు చేశారు లేబర్ స్టాటిక్ టీమ్ లో ఇద్దరు చొప్పున ఉంటారు. వీరికి అవసరమైన, కావల్సిన సామాగ్రి అయిన గడ్డ పారలు, పారలు, నీటిని తొలగించే  పంపుసెట్ లను అందుబాటులో ఉంటాయి  అత్యవసరం సందర్భం లో ఈ  బృందాలను ఒక ఏరియా ఇంకొక ఏరియాకు షిఫ్ట్  చేస్తారు టీమ్ లకు అవసరమైన నిలిచిన నీరు తోడెందుకు  237 పెంపు సెట్   ను కూడా సమకూర్చారు. సి అర్ ఏం పి ద్వారా 29 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను ఏర్పాటు చేశారు.

నగరం లో వర్ష కాలం లో  నాలాల ద్వారా ఎలాంటి  ప్రమాదాలు సంభవించకుండా  భద్రత చర్యలను చేపట్టారు. అందుకోసం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాదాలు కాకుండా ఒక్కొక్క వల్వరెబుల్ పాయింట్ వద్ద ఒక్క అధికారిని నియమించారు. సమస్యాత్మక ప్రాంతలో హెచ్చరిక  బోర్డు ల తో పాటు మెస్ ను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ మెయింటెయినెన్స్ ద్వారా జోనల్ వారీగా భద్రత చర్యలు తీసుకుంటున్నారు.

ఎల్ బి నగర్ జోన్ లో నాలా లో 74 సమస్యాత్మక లొకేషన్ లను  గుర్తించ గా అక్కడ 76 మంది అధికారులను నియమించారు. చార్మినార్ జోన్ లో 52 లొకేషన్ లలో  32 మంది అధికారులను, ఖైరతాబాద్ జోన్ లో 85 లొకేషన్ లలో 81 మంది అధికారులను, శేరిలింగంపల్లి  జోన్ లో 52 లొకేషన్ లలో 52 మంది అధికారులను, కూకట్ పల్లి జోన్ లో 48 లొకేషన్ లలో 49 మందిని, సికింద్రాబాద్ జోన్ లో 55 సమస్యాత్మక ప్రాంతాల్లో 79 మంది  అధికారులను నియమించారు. 35 ప్రాజెక్టు పనుల వద్ద 18 మంది అధికారులను నియమించారు.

పని నిరంతరంగా కొనసాగించేందుకు నీరు ను తొలగించడం,అవసరమైన కూలీలను, ఇసుకను  సిద్దం చేసుకోవడం పని జరిగే చోట ప్రమాదాలు సంభవించకుండా బ్యారి కేడింగ్, హెచ్చరిక బోర్డు లు,  విద్యుత్ కాంతులతో సైన్ బోర్డు లు  ఏర్పాటు చేశారు. పని జరుగుతున్న 36 ప్రదేశాలలో భద్రత చర్యలు చేపట్టారు అందు కోసం  18 అధికారులను నియమించారు.

నిరంతరంగా పని  కొనసాగించేందుకు  అవసరమైన మేన్ మెటీరియల్ ను సనకుర్చుతారు. చెరువుల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘనలు జరగకుండా185 చెరువులలో ,19 మంది అధికారులను  నియమించారు. వర్షాలు కురిసే సందర్భం  లో  ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జి హెచ్ ఏం సి కోరింది.

Related posts

విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలి

Satyam NEWS

తెలుగు భాష కనుమరుగవకూడదన్న తపన

Satyam NEWS

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్

Satyam NEWS

Leave a Comment