41.2 C
Hyderabad
May 4, 2024 16: 18 PM
Slider ప్రత్యేకం

ఆల్కహాల్ తయారీలో మత్తుపదార్ధాలు….?

#Raghurama

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజు అనుమానం

ఆల్కహాల్ తయారీలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈ ఎన్ ఐ) తప్పక వాడాలని నిబంధనలు చెబుతున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నిబంధనలు పాటించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత జగన్ ప్రభుత్వ పాలనలో మద్యం ఉత్పత్తి లో ఆల్కహాల్ తక్కువగా ఉండడంతో, మత్తు కలిగించే పదార్థాలను వాడుతున్నట్లు అనుమానంగా ఉందన్నారు.

గతంలో 50 వేల శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తే, ప్రస్తుతం లక్ష యాభై వేల శాంపిల్స్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా సాక్షి దినపత్రికలో కథనం ప్రచురించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఎస్ జి ఎస్ అనేది వరల్డ్ క్లాస్ లేబరేటరీ అని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్న సంస్థ  అని పేర్కొన్నారు. ఆ సంస్థ  తప్పు పట్టిందని గుర్తు చేశారు.

రాష్ట్ర అ విభజన అనంతరం కొన్ని డిస్టరీ లకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుమతించిన మాట నిజమే అయినప్పటికీ, ప్రముఖ మద్యం బ్రాండ్ సంస్థలకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. అయితే సాక్షి దినపత్రిక మాత్రం తన కథనంలో యనమల రామకృష్ణుడు గారి తోడల్లుడు మునిమనవడు.. అయ్యన్నపాత్రుడు ప్రమేయం ఉందంటూ, తల తోక లేకుండా రాసింది అన్నారు. రాష్ట్రంలో లో డిస్టరీ లను నిర్వహిస్తున్న ది ఎవరో ప్రభుత్వం స్పష్టం చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

Related posts

జూన్ 10 న జాతీయ లోక్ అదాలత్

Bhavani

సెక్సీ స్టోరీ: తల్లిదండ్రులు, మికాయిలా ఓ రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

కరోనా ఎలర్ట్: ఏపీలో 143కు చేరిన కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment