39.2 C
Hyderabad
May 3, 2024 14: 58 PM
Slider ఆదిలాబాద్

విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలి

#SaveInida

రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సరైంది కాదని ఎస్ టి ఎఫ్ ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సేవ్ ఇండియా డే సందర్భంగా దేశ వ్యాప్తంగా నేడు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతున్నది.

దీనికి మద్దతుగా ఎస్ టి ఎఫ్ ఐ రాష్ట్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ప్రజాస్వామికవాదులు, ఉపాధ్యాయులు, మేధావులు అధిక సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం మన రాజ్యాంగ విలువలు కాగా వాటిని తుంగలో తొక్కుతూ విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశక నిర్ణయాలు సరి కాదని శాంతి కుమారి తెలియజేశారు.

కార్పొరేట్ల లాభాలు కోసం సామాన్య ప్రజల పై భారం మోపడం వంటి ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటూ బలోపేతం చేసుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆమె అన్నారు.

విద్యలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, విద్య కాషాయీకరణ సరి అయింది కాదని ఆమె అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగింపు చాలా దుర్మార్గమని రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 20 20 వెంటనే సవరించాలని  TSUTF డిమాండ్ చేసింది.

కరోనా సహాయక చర్యల్లో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని, దేశంలో అత్యధికంగా  కరోనా తీవ్రత వల్ల అనేక మరణాలు జరుగుతున్నా కూడా ప్రజలను పట్టించుకోకుండా సహాయక చర్యలు చేపట్టకుండా ప్రభుత్వ వైఫల్యం అద్దం పట్టినట్టుగా కనిపిస్తోందని ఆమె అన్నారు. ఈరోజు నిరసన కార్యక్రమంలో పెన్షనర్స్ బాధ్యులు  వి.బాపు, శ్రీనివాస్ ,అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేరిణి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు రావాలి

Satyam NEWS

పిల్లలపై లైంగిక వేధింపులపై 14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

Sub Editor

రైతుల్ని దోచుకునేందుకు వైసీపీ ఫోన్ పే బ్యాచ్ లు దిగాయి

Bhavani

Leave a Comment