23.2 C
Hyderabad
May 7, 2024 21: 09 PM
Slider వరంగల్

నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుక నిర్వహించుకుందాం

#ranganath

నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ | ప్రజలకు సూచించారు. తీపిగుర్తులతో గడిచిపోతున్న 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రానున్న 2023 సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికే వేళ ప్రజలు జాగ్రత్తలు, నియమనిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో వుంచుకోని రేపటి రోజున ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 9గంటలనుండి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు ముమ్మరంగా వాహన తనీఖీలు నిర్వహించడంతో పాటు డ్రంక్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తామని ఇందుకోసం ట్రై నీటి పరిధిలో మొత్తం యాభైకి పైగా వాహన తనిఖీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఇందుకోసం. ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని, మద్యం సేవించి వాహనం నడపరాదని, -మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహన డ్రైవింగ్ అనుమతించకూడదని, త్రిబుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలను నడపడంతో పాటు సైలెన్సర్ తొలగించి వాహనాలను నడపటం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

అలాగే వాణిజ్య సముదాయాలు నిర్ధేశించిన సమయానికి మూసివేయాలని, డీజేలు, ఇతర శబ్ధ కాలుష్యాన్ని ఏర్పరిచి ఇతరులకు ఇబ్బంది కలిగించే వాటికి అనుమతి లేదని కమిషనర్ తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రమాదం పొంచి వున్నందున పబ్లిక్ ప్రదేశాల్లో, ప్రధాన రోడ్డు మార్గాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోరాదని ఆయన అన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పు వున్నందున వీలైనంత వరకు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కల్పి సంతోషాల నడుమ ఇండ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసారు.

Related posts

కరోనా కన్ఫ్యూజన్: వూహాన్ లోని తెలుగువారు క్షేమం

Satyam NEWS

డ్రామారావులు డ్రామాలను బంద్ చెయ్యాలి : నూనె బాల్ రాజ్

Satyam NEWS

విచ్ఛిన్నకారులకు వ్యతిరేకంగా కవులు ముందుకు కదలాలి

Satyam NEWS

Leave a Comment