35.2 C
Hyderabad
May 1, 2024 00: 08 AM
Slider గుంటూరు

నాలుగో విడత కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

#Corona

నాలుగో విడత కరోనా వైరస్ వ్యాప్తి చెందితే తట్టుకునే విధంగా ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రపత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అప్రమత్తం చేశారు. గురువారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా వైద్యశాల సమావేశ మందిరంలో నాలుగో విడత కరోనా వ్యాప్తిపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ కోవిడ్ వైరస్ మళ్లీ వ్యాప్తి చెందితే వైద్యశాలో ఎన్ని బెడ్స్ అవసరమవుతాయి, ఎన్ని ఉన్నాయి..? ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?

ఎన్ని పనిచేస్తున్నాయని సూపర్డెంట్ వెంకట్రావును ఆరా తీశారు. ఆక్సిజన్ ప్లాంట్ ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు ఎంతమంది ఉన్నారో సమీక్షించారు.దాంతోపాటు ఆక్సిజన్ సిలిండర్లు ఏమన్నా అవసరం అవుతాయా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ వెంకట్రావు సమాధానమిస్తూ కోవిడ్ వస్తే అందరం సంసిద్ధంగా ఉన్నామన్నారు. రెండు ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నామని, 87 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని

వివరించారు. హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ దాతలు, ప్రభుత్వ సహకారంతో మొత్తం 56 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయని, ఒకేసారి 125 మందికి కోవిడ్ ట్రీట్మెంట్ అందించవచ్చని దానికి కావాల్సిన సదుపాయాలన్నీ సమృద్ధిగా ఉన్నాయని తెలియజేశారు.

పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సయ్యద్ కాజా, ఏపీ ఎమ్మెస్ ఐడి ఈ ఈ శ్రీధర్, డి ఈ భాగ్యలక్ష్మి, ఆర్ఎంవో శోభారాణి , వైద్యులు,స్టాప్ నర్సులు పాల్గొన్నారు.

Related posts

రాంగ్ గోపాల్ వర్మ చిత్రం పోస్టర్ విడుదల

Satyam NEWS

ఉప్పల ట్రస్ట్ సహకారంతో మూత్రశాల నిర్మాణం

Satyam NEWS

ఒక వైపు 25 ఏళ్ల యువకుడు, మరోవైపు ఇద్దరు పిల్లల తల్లి…

Satyam NEWS

Leave a Comment