24.7 C
Hyderabad
May 13, 2024 04: 17 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

#foodpoisaning

సుమారు అరగంట పాటు ఉడికిస్తే తప్ప ఉడకని పప్పు ఒకటి.. మరొకటి కాస్త ఉడికినా ఉడకక పోయినా తినే పప్పు మరొకటి. ఈ రెండింటిని ఒకచోట వండటంతో అది తిన్న విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలం భవానిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం రోజు మాదిరిగానే మధ్యాహ్న భోజనం చేశారు విద్యార్థులు.

మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎర్రపప్పు, పెసరపప్పు కలిపి ఒకేచోట వండారు. అందులో ఎర్రపప్పు సరిగ్గా ఉడకలేదు. అదే వంట తిన్న గంట తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఇలా సుమారు 20 మందికి కావడంతో విద్యార్థులు ఇంటికి వెళ్లకుండా ఉపాధ్యాయులు పాఠశాలకే వైద్యులను పిలిపించారు. విద్యార్థులను ఒకచోట ఉంచి టాబ్లెట్స్ అంధించారు.

సాయంత్రం విద్యార్థులు ఇంటికెళ్లే సమయం మించిపోయినా ఇంటికి రాకపోయేసరికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు పాఠశాలకు పరుగులు పెట్టగా ఫుడ్ పాయిజన్ విషయం బయటపడింది. దాంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. ఇంత జరిగినా తమకెందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు.

గతంలో మధ్యాహ్న భోజన ఏజన్సీ మార్చాలని ఎన్నిసార్లు మెలరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఇప్పుడు ఇంతదాకా వచ్చేదాకా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను సముదాయించడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించినా వినిపించుకోలేదు. రాత్రి వరకు కొనసాగుతున్న ఆందోళన మధ్య 3 అంబులెన్సులలో విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆస్పత్రి వాతావరణం సందడిగా మారింది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

విద్యాశాఖ అధికారులు, పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మొదటగా 13 మంది విద్యార్థులు ఆస్పత్రికి చేరుకోగా తర్వాత మరొక 9 మంది ఆస్పత్రికి వచ్చారు. విద్యార్థులకు సెలైన్ ఎక్కించి చికిత్స నిర్వహిస్తున్నారు వైద్యులు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు సుమారుగా 40 మంది విద్యార్థుల వరకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందులో 22 మంది విద్యార్థులను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్న వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం -శేఖర్, గ్రామస్తుడు

శేఖర్, గ్రామస్తుడు

మధ్యాహ్న భోజన నిర్వహణపై ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారు. ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదు. దసరా కంటే ముందు ఏజన్సీని మార్చాలని చెప్తే మధ్యాహ్న భోజన బిల్లులు రావడం లేదని ధర్నాలో ఉన్నారని, ధర్నా తర్వాత మారుస్తామన్నారు. ఇప్పుడు అడిగితే భోజనం సరిగా వండటం లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు. ఇలాగైతే మా పిల్లల పరిస్థితి ఏంటి

ఫుడ్ పాయిజన్ జరిగినా చెప్పలేదు

మద్యాహ్నమే మా పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరిగినా సాయంత్రం వరకు మాకు చెప్పలేదు. మేము వెళ్ళేదాక మాకు తెలియనివ్వలేదు. ఇంకా ఏదైనా జరిగినా ఇంతేనా. మా పిల్లలకు సరిగా ఫుడ్ పెట్టడం లేదు. అందుకే ఇలా జరిగింది. చెప్తే పట్టించుకోలేదు. అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు.

తల్లిదండులకు చెప్పనివ్వలేదు

పాఠశాలలో అన్నం సరిగా వండటం లేదు. ఈ విషయం మా ఇళ్లలో చెప్పనివ్వలేదు. చాలా సార్లు ఇంటినుంచి టిఫిన్స్ తీసుకెళ్లినాము. అధికారులు విచారణకు వచ్చాక రెండు మూడు రోజులు మాత్రమే వంట బాగా చేస్తారు. మళ్ళీ అదే తంతు. ఈ రోజు కూడా మమ్మల్ని ఇంటికి వెల్లనివ్వలేదు. పాఠశాలకే వైద్యులను పిలిపించి టాబ్లెట్స్ ఇప్పించారు. ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. ఒక్కొక్కరుగా చాలా మంది వాంతులు చేసుకున్నారు. మాకు చాలా భయం వేసింది

Related posts

అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాల పరిశీలన

Satyam NEWS

రెండు రోజుల పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి

Satyam NEWS

Corona 2nd wave: మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయాలు

Satyam NEWS

Leave a Comment