31.2 C
Hyderabad
May 3, 2024 03: 03 AM
Slider ముఖ్యంశాలు

చివరికి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

#Kiran Kumar Reddy

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరదామా అని ఆలోచిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి చివరకు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో శుక్రవారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరారు. కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారని, దీంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.

Related posts

‘దేశం’ వైపు చూస్తున్న వైసీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు?

Satyam NEWS

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అరెస్టు

Satyam NEWS

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Murali Krishna

Leave a Comment