36.2 C
Hyderabad
May 7, 2024 13: 46 PM
Slider ప్రత్యేకం

‘దేశం’ వైపు చూస్తున్న వైసీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు?

#srikrishnadevaraulu

వైనాట్ 175 అనే నినాదం జగన్ ఏ క్షణంలో ఎత్తుకున్నారో తెలియదు కానీ పార్టీకి మాత్రం ఆనాటి నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే నర్సాపూర్ ఎంపి కె.రఘురామకృష్ణంరాజు తిరుగుబాటు జెండా ఎగరువేసి అనుక్షణం పక్కలో బల్లెంలా మారగా తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంధిస్తున్న అస్త్రాలతో పటిష్టమైన కోటలా ఉన్న వైసీపీకి బీటలు పడ్డాయి. ఈ ముగ్గురు చేస్తున్న పోరాటం ముఖ్యమంత్రి జగన్ కు నిద్రలేని రాత్రులు తెప్పించాయి.

తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు శ్రీకృష్ణ దేవరాయలు కూడా త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబుతున్నారని తెలిసింది. పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ముక్కు సూటిగా పోయే రాజకీయ నాయకుడు. ఆయన నిజాయితీగా ఉండటం, సేవాభావంతో ఉండటం నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని చాలా మంది ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. దాంతో శ్రీకృష్ణ దేవరాయలును పార్లమెంటు పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన నిజాయితీగా ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

దాంతో ఆయన పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీ లో చేరనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు తో కొద్దిరోజుల క్రితం సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఈయన విజ్ఞాన్ విద్యాసంస్థల ఓనర్. శ్రీకృష్ణ దేవరాయలు పోటీచేసిన మొదటి సారి  నరసరావుపేట లోక సభ సభ్యుడిగా గెలిచారు. పార్టీ లో తనకు ఎటువంటి ప్రాధాన్యత లేదని భావిస్తున్న నరసరావుపేట MP తెలుగుదేశం పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Related posts

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

Satyam NEWS

ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా పని చేయాలి: మంత్రి తానేటి వనిత

Satyam NEWS

ఈ సారి పులివెందులలో జగన్ కు కష్టమే…

Satyam NEWS

Leave a Comment