36.2 C
Hyderabad
May 7, 2024 12: 07 PM
Slider ప్రత్యేకం

ప్రియాంకను హతమార్చిన దుర్మార్గులు వీరే

priyanka culprits

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. స్కూటీ టైర్‌ పంక్చర్‌ చేసి నిందితులు డ్రామాలు ఆడారని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.

సంచలనం సృష్టించిన కేసును సీరియస్‌గా తీసుకొని 24 గంటల్లోనే ఛేదించి నిందితులను కూడా పట్టుకున్నారు. ఊపిరాడకుండా చేసి ప్రియాంకను దారుణంగా హత్య చేశారు. ప్రియాంకపై నిందితులు గ్యాంగ్‌ రేప్‌కు కూడా పాల్పడ్డారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్‌ పోసి తగలబెట్టారు.

ప్రియాంక మృతదేహాం 70 శాతం కాలిపోయింది. లారీ డ్రైవర్లు హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. నలుగురు కలిసి అఘాయిత్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రియాంక హత్య కేసులో మహ్మద్‌ పాషా ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. వైద్యురాలి హత్యకేసులో  ఏ1 లారీ డ్రైవర్‌ ఆరిఫ్‌ (26), ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.

లారీలో ఇనుము అన్‌లోడ్ చేయకపోవడంతో టోల్‌గేట్ దగ్గరే లారీ పార్క్ చేశారన్నారు. తొండుపల్లి దగ్గర యువతి స్కూటీ పార్క్ చేయడం లారీ వాళ్లు చూసినట్లు చెప్పారు. మళ్లీ ఆమె వస్తుందని నిందితులు మాట్లాడుకుని కుట్ర పన్నినట్లు వెల్లడించారు. నవీన్‌ స్కేటీ బ్యాక్ టైర్‌లో గాలి తీసేయాలని ప్లాన్‌ చేశాడన్నారు. రా. 9.13కి గచ్చిబౌలి నుంచి ప్రియాంక రిటర్న్ వచ్చిందన్నారు. ఆమె రాగానే పంక్చర్‌ అయిందని వారు చెప్పారని తెలిపారు.

పంక్చర్‌ చేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసిందన్నారు. పంక్చర్‌ వేయిస్తామని ఇద్దరూ స్కూటీ తీసుకెళ్లినట్లు వెల్లడించారు. స్కూటీకి గాలి కొట్టించి వాపస్ వచ్చేశారన్నారు.అత్యాచారం సమయంలో యువతి నోరు మూసేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఆ సమయంలోనే ప్రియాంక చనిపోయిందన్నారు.

శివ, నవీన్‌ టూవీలర్‌ నడిపినట్లు చెప్పారు. మిగతా ఇద్దరూ లారీ నడిపించారని వివరించారు. ఇండియన్‌ ఆయిల్‌ బంకులో పెట్రోల్ తీసుకున్నారన్నారు. షాద్‌నగర్‌ దగ్గర యూటర్న్‌ తీసుకున్నారన్నారు. బ్లాంకెట్‌లో మృతదేహాన్ని చుట్టి నిప్పు పెట్టి తగలబెట్టారన్నారు. డెడ్‌ బాడీ కాలిందా? లేదా? అని మళ్లీ వెళ్లి చూశారన్నారు. తర్వాత ఆరాంఘర్‌ చేరుకొని… లారీ అన్‌లోడ్ చేసి ఎక్కడి వాళ్లు అక్కడికి పోయారని తెలిపారు.

Related posts

ఖైరతాబాద్ గణనాధ విగ్రహ తయారీ పూజ ప్రారంభం

Satyam NEWS

రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు

Satyam NEWS

ఏపీ అంటే ఏకచక్రపురం: వైసీపీ అంటే బకాసురుడు

Satyam NEWS

Leave a Comment