33.7 C
Hyderabad
April 29, 2024 01: 00 AM
Slider ఆధ్యాత్మికం

ఖైరతాబాద్ గణనాధ విగ్రహ తయారీ పూజ ప్రారంభం

#Khairatabad Ganesh

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం అయింది. ఈ సారి 9 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. ఖైరతాబాద్ లో గణేషుడి విగ్రహం స్థాపించడం ప్రారంభించి ఇది 66 వ సంవత్సరం.

ఈ సారి మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాథుడికి ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. కరోనా కారణంగా నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడిని మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు.

ఏ కార్యక్రమానికి కూడా భక్తులు ఎవ్వరు రావద్దని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కోరింది. ఆన్ లైన్ ద్వారా దర్శనం చేసుకుని ఖైరతాబాద్ వినాయకుడి అనుగ్రహకు పాత్రులు కావాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.

Related posts

మరో క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

Satyam NEWS

గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Satyam NEWS

ఎల్లో మీడియా ద్వారా బాబు జగన్ పాలనను అప్రతిష్ట చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment