36.2 C
Hyderabad
May 15, 2024 17: 38 PM
Slider తూర్పుగోదావరి

తిరుమల తిరుపతి కి కడియం నుండి 10 వేల ఉచిత మొక్కలు

#kadiyam narsary

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడియం పల్ల వెంకన్న చారటిబుల్ ట్రస్ట్ బృహుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కలియుగ వైకుంఠాధిపతి వెంకటేశుని సన్నిధి తిరుమల తిరుపతికి 10 వేల మొక్కలను ఉచితంగా పంపింది. పేర్కొరియా గిగానాటస్, సాంగ్ ఆప్ ఇండియా, ఫోనెక్స్ పామ్, అరెలియా వంటి 15 జాతుల మొక్కలను లారీ లో ఎగుమతి చేశారు.

వీటిలో పేర్కొరియా గిగానాటస్ జాతి మొక్కలు కొండ వాలుల పరిరక్షణ కు ఉపయోగపడతాయి. నీరు లేకపోయినా వాలు ప్రాంతాల్లో ఈ మొక్కల వేళ్ళు అల్లుకొని కొండ చరియలు విరిగిపడకుండా రక్షణ ఇస్తాయి.

పర్యావరణ హితం కోసం తన తండ్రి స్వర్గీయ పల్ల వెంకన్న 6 ఏళ్ల క్రిందటే బడితోట పేరుతో ఉచిత మొక్కల పంపిణీ చేపట్టారని ఆయన కుమారులు ఐఎన్ఏ మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, అపర్ణాసమేత అనంతేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పల్ల సత్యనారాయణ మూర్తి, పల్ల గణపతి తెలిపారు.

ఉభయగోదావరి జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ను,అన్నవరం,ద్వారకా తిరులమల వంటి పుణ్యక్షేత్రాల కు ఉచిత మొక్కల పంపిణీ జరిగిందన్నారు. ఒక మహోద్యమంలా లక్షల్లో ఉచిత మొక్కల పంపిణీ చేశామన్నారు.

Related posts

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే.. ప్రజలను హెచ్చరించిన కమిషనర్

Satyam NEWS

మంత్రుల సెల్ ఫోన్లు కట్

Satyam NEWS

వైసిపి ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు నిజాలు తెలుసు

Satyam NEWS

Leave a Comment