29.7 C
Hyderabad
April 29, 2024 08: 42 AM
Slider విజయనగరం

జులాయి గాళ్ల కు విజయనగరం పోలీసులు “క్లాస్”…!

#lock down

జులాయి అంటే.. పనీ పాట లేకుండా, బాధ్యత లేకుండా రోడ్లపై తిరిగేవారని ప్రతీ ఒక్కరికీ తెలుసు.ఆ పేరుతో ఏకంగా సినిమా నే విడుదల అయ్యింది.

అయితే సినిమా కబుర్లు ఎందుకనేగా మీ డౌట్.  విజయనగరం జిల్లాలో గడచిన మూడు ,నాలుగు రోజుల నుంచీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ పరిస్థితులలో లాక్ డౌన్ సమయాలలో రోడ్లపై తిరుగుతున్న వారిపై విజయనగరం పోలీసులు ఓ కన్నేసారు. అందులో ఎక్కువగా కుర్రాళ్లు, జులాయి తిరుగుళ్లు తిరిగే వారు..రోడ్డుపై కనిపించారు.

లాక్ డౌన్ లో యధావిధిగా తనిఖీలు చేస్తున్న పోలీసు లకు ఏకంగా పదిమంది యువకులు పట్టు బడ్డారు.

అదీ నగరంలో సీఎంఆర్ జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ ఎస్ఐ బీ.దేవి కంట పడ్డారు.

ప్రశ్నిస్తే..ఆ యువకుల వద్ద ఎలాంటి సర్టిఫికెట్ లు ,లైసెన్స్, లాక్ డౌన్ లో అనవసరంగా రోడ్ మీదకు ఎందుకు వచ్చారన్న ఆధారం లేకపోవడంతో వారినందరికి క్లాస్ తీసుకున్నారు.. ఎస్ఐ దేవీ.

బండ్లపై విచక్షణా రహితంగా పోలీసులు ఆపినా సరైన కారణం చెప్పకుండా వారిని తప్పించుకుని పారిపోవడంతో..స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తో సదరు కుర్రాళ్లను పట్టుకుని వారందరినీ దాదాపు మూడుగంటల సేపు ఉంచి..వాళ్ల బైక్స్ ను స్టేషన్ కు తరలించారు.

ఏదైనా నగరంలో పోలీసులు… యువకులలో వణుకు పుట్టిస్తున్నారనే చెప్పాలి.

Related posts

వాద్ నగర్ లో పండుగ ఉత్సవాల కుస్తీ పోటీలు

Satyam NEWS

Analysis: సరిహద్దుల్లో చెత్త గేమ్ ఆడుతున్న చైనా

Satyam NEWS

సైకో పాలన అంతమొందిద్దాం

Satyam NEWS

Leave a Comment