39.2 C
Hyderabad
May 3, 2024 12: 35 PM
Slider పశ్చిమగోదావరి

అప్ ల్యాండ్ టైగర్ చల్లగొల్ళ సూర్యనారాయణ మృతి

#suryanarayana

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీ రాములుతో కలిసి పోరాడిన ఒక పోరాట సమరయోధుడిని రాష్ట్రం ఈ రోజు కోల్పోయింది.

రాజకీయ విలువలు, విశ్వసనీయత కలిగిన ఒక సోషలిస్టు పార్టీ దిగ్గజం సోమవారం ఉదయం 7 గంటలకు తుది శ్వాస విడిచారు.

చల్లగొళ్ల సూర్యనారాయణ ( 95) పశ్చిమగోదావరిజిల్లా పెడవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో తన స్వగృహం లో ఆయన మరణించారు.

రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీ రాములుతో కలిసి ఆయన ఎన్నో పోరాటాలలో పాల్గొని పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు.

రాష్ట్ర ఆయిల్ ఫెడ్ రైతు కమిటీ చైర్మన్ కోటారు రామచంద్రరావు కు ఆయన జన్మనిచ్చిన తండ్రి. దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి తాత గారు.

ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు, రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, మూల్పూరి రంగయ్య, అప్పటి ఎం ఎల్ సి మాగంటి బాపినీడు, గారపాటి చిన్న కనకయ్య, భోగాపురం మునసబ్ మోటపర్టీ రామ్మోహన్ లాంటి రాజకీయ హేమా హేమీలతో సూర్యనారాయణ కలిసి పని చేశారు.

అప్ లాండ్ టైగర్ గా బిరుదు అందుకున్నారు. చల్లగొళ్ల సూర్యనారాయణ మృతితో రాయన్నపాలెం, కొండలరావు పాలెం, రాట్నాలకుంట గ్రామాలు మూగబోయాయి.

Related posts

గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ ను కలసిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు

Satyam NEWS

వార్నింగ్:రజనీకాంత్ నుచంపుతామని బెదిరింపులు

Satyam NEWS

Introduction To Investments

Bhavani

Leave a Comment